జాకెట్ కొన్న మోడీ

  • Published By: madhu ,Published On : January 18, 2019 / 01:51 AM IST
జాకెట్ కొన్న మోడీ

Updated On : January 18, 2019 / 1:51 AM IST

ఢిల్లీ : నిత్యం బిజీగా ఉండే ప్రధాని మోదీ.. తన కోసం షాపింగ్‌ చేశారు. తాను కోరుకుంటే ఏదైనా.. ఎవరైనా బహుమతిగా ఇస్తారు. కానీ.. ఆయన స్వయంగా షాపింగ్‌ ఫెస్టివల్‌లో జాకెట్‌ కొనుగోలు చేశారు. అంతేకాదు.. డిజిటల్‌ ఇండియా కోసం కృషి చేస్తున్న ఆయన.. తాను కొనుగోలు చేసిన జాకెట్‌కు రూపే కార్డు ద్వారా చెల్లింపులు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్‌ షాపింగ్‌ ఫెస్టివల్‌లో సందడి చేశారు. ప్రతి యేటా రాష్ట్ర ప్రభుత్వం ‘వైబ్రాంట్‌ గుజరాత్‌’లో భాగంగా షాపింగ్‌ ఫెస్టివల్‌ను నిర్వహిస్తోంది. ఇక 12 రోజులపాటు జరిగే ఈ షాపింగ్‌ ఫెస్టివల్‌లో 15 వేల మంది దుకాణదారులు, విక్రేతలు, తయారీదారులు పాల్గొని తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. ఈ షాపింగ్‌ ఫెస్టివల్‌కు ప్రధాని మోదీ హాజరై.. మొత్తం కలియ తిరిగారు. షాపులో జాకెట్‌ను కొనుగోలు చేసిన మోదీ.. రూపే కార్డు ద్వారా బిల్లు చెల్లించారు. అయితే.. బిల్లు చెల్లింపులో భాగంగా కార్డు పిన్‌ నెంబర్‌ పక్కనున్న వ్యక్తి ఎంటర్‌ చేయడం విశేషం. కార్డు పిన్‌ నెంబర్‌ ఇతరులకు తెలిస్తే.. మిస్‌ యూజ్‌ అయ్యే ప్రమాదం ఉందని తెలిసినా.. ప్రధాని కార్డు నెంబర్‌ ఇతరులకు చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది.