Modi Teleprompters : బీహార్ మోడీ సభలో టెలీప్రాంప్టర్

  • Published By: madhu ,Published On : March 4, 2019 / 03:07 PM IST
Modi Teleprompters : బీహార్ మోడీ సభలో టెలీప్రాంప్టర్

Updated On : March 4, 2019 / 3:07 PM IST

భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ..అనర్గళంగా మాట్లాడే వ్యక్తి. ఎన్నికల ప్రచార సభలు..ఇతర సభలు..పార్లమెంట్.. వివిధ దేశాల్లో స్పీచ్‌లతో దంచి కొడుతుంటారు. పంచ్ పంచ్ డైలాగ్‌లు పేలుస్తుంటారు. తనదైన శైలిలో మాట్లాడుతూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటారు మోడీ. ఏదైనా సభలలో పాల్గొంటే పేపర్‌లు లేకుండా స్పీచ్‌ని ఊదరగొడుతుంటారు. ఎక్కడా పేపర్ చూడకుండా ఆయన చేసే అనర్గ ప్రసంగంపై ప్రజలు కొంత ఆసక్తిని చూపుతుంటారు. అయితే…బీజేపీ నిర్వహించిన ర్యాలీలో మోడీ ఎదుట ‘టెలీప్రాంప్టర్’ ఉండడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

పాట్నాలో బీజేపీ ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగసభలో మోడీ పాల్గొని స్పీచ్ ఇచ్చారు. ఆయన ఎదుట టెలీప్రాంప్టర్‌లు దర్శనమిచ్చే వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బీజేపీ మాత్రం దీనిని కొట్టిపారేస్తోంది. ఏహే..అలాంటిది ఏమీ లేవని అక్కడి రాష్ట్ర నేతలు వెల్లడిస్తున్నారు. 

టెలీప్రాంప్టర్..ఒక టీవీ తెర లాంటిదే. వార్తా ఛానల్స్‌లో యాంకర్లు, న్యూస్ రీడర్లు వీటిపై ఆధారపడుతుంటారు. ఎదురుగా వీటిని ఏర్పాటు చేస్తుంటారు. అందులో డిస్ ప్లే అవుతున్న వాటిని  చదువుతుంటారు. మరి మోడీ టెలీప్రాంప్టర్ ఉపయోగించడంపై ప్రతిపక్షాలు ఎలాంటి సెటైర్లు వేస్తాయో చూడాలి.