PM Modi : ఢిల్లీకి రాగానే ఎల్జీకి ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్.. ట్విటర్లో అసలు విషయాన్ని చెప్పిన ఎల్జీ సక్సేనా
ప్రధాని నరేంద్రమోదీ విదేశీ పర్యటన ముగించుకొని శనివారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలో వరదల పరిస్థితి, యమునా నది ఉధృతికి, ప్రజల రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ఫోన్ చేసి తెలుసుకున్నారు.

PM Modi and Delhi Lt Governor
Delhi Lt Governor VK Saxena : ఢిల్లీ (Delhi) నాలుగు రోజులుగా జలదిగ్బంధంలో ఉంది. యమునా నది (Yamuna river) ఉధృతి కారణంగా నదీ పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. పలు ప్రధాన వీధుల్లోకి నీరు చేరింది. అయితే, శుక్రవారం రాత్రి నుంచి వరద ఉధృతి తగ్గుతూ వస్తోంది. ఢిల్లీలో ఎడతెరిపి లేని వర్షాలు, యమునా నది వరద ఉధృతి కారణంగా అనేక కాలనీలు నీట మునిగాయి. యమునాలో వరద ప్రవాహం తగ్గినప్పటికీ ఢిల్లీ రోడ్లపై నీరు తగ్గలేదు. ఐటీఓ వద్ద డ్రెయిన్ రెగ్యులేటర్‌కు ఆర్మీ మరమ్మత్తులు పూర్తి చేసింది. అక్కడ వరద నీటితో సెంట్రల్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ మధ్య వాహన రాకపోకలు నిలిచిపోయాయి. లక్ష్మీ నగర్‌కి వెళ్లే రోడ్లను పూర్తిగా మూసివేశారు.
Delhi flood: జల దిగ్బంధంలోనే ఢిల్లీ.. ఆ ప్రాంతాల మధ్య మెట్రో ద్వారానే రాకపోకలు
ఢిల్లీలో శనివారం కురిసిన వర్షం కారణంగా భైరాన్ మార్గ్‌లో ట్రాఫిక్ పై అధికారులు ఆంక్షలు విధించారు. మరోవైపు సెంట్రల్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీని కలిపే వికాస్ మార్గ్ మూతపడటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కేవలం మెట్రో ద్వారా మాత్రమే సెంట్రల్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ మధ్య వెళ్లే సౌకర్యం ఉంది. రోడ్లు మూతపడటంతో ఢిల్లీ బ్లూ లైన్ మెట్రోలో రద్దీ పెరిగింది. నాలుగు రోజుల క్రితమే యమునా నదీ పరివాహక ప్రాంతాల ప్రజలతో పాటు, లోతట్టు ప్రాంతాల ప్రజలను ఢిల్లీ ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. వారికి వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసింది. వరదల కారణంగా అనేక ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీలో యమునా నది ఉధృతి, భారీ వర్షం కారణంగా ఎదురైన ఇబ్బందులపై ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని కేంద్ర మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి తెలుసుకున్నారు. అన్ని విధాల బాధిత ప్రజలకు అండగా ఉండాలని సూచించారు.
Delhi Floods: యమునా నది వరద ఉధృతికి విరిగిపోయిన రెగ్యులేటర్.. భయం లేదన్న కేజ్రీవాల్
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫ్రాన్స్, యూఏఈ దేశాల పర్యటన ముగించుకొని శనివారం రాత్రి ఢిల్లీకి వచ్చారు. శనివారం రాత్రి ఢిల్లీకి తిరిగివచ్చిన మోదీకి పలువురు అధికారులు స్వాగతం పలికారు. అయితే, ఢిల్లీలోని తన నివాసానికి చేరుకున్న వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ ( PM Narendra Modi) ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా (Delhi Lt Governor VK Saxena) కు ఫోన్ చేశారు. ఢిల్లీలో వరదల పరిస్థితి, వాటిని ఎదుర్కొనేందుకు ప్రజలకోసం తీసుకున్న రక్షణ చర్యలపై ఫోన్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని సక్సేనా తన అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా తెలిపారు.
PM Modi lands in Delhi : ముగిసిన యూఏఈ, ఫ్రాన్స్ దేశాల పర్యటన…ఢిల్లీకి తిరిగివచ్చిన మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల విదేశీ పర్యటన ముగించుకొని శనివారం రాత్రి స్వదేశానికి చేరారని, వెంటనే తనకు ఫోన్ చేసి ఢిల్లీ వరదల పరిస్థితిని, ప్రజల రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారని ఢిల్లీ ఎల్జీ తెలిపారు. కేంద్రం, సహాయ, సహకారాలతో ఢిల్లీ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సాధ్యమైనన్ని పనులు చేయాలని ప్రధాని మోదీ మళ్లీ ఆదేశాలు ఇచ్చారని సక్సేనా తెలిపారు.
माननीय प्रधानमंत्री श्री @narendramodi जी ने स्वदेश पहुंचते ही फोन कर दिल्ली में बाढ़ की स्थिति का विस्तृत ब्योरा लिया और किये जा रहे सम्बंधित प्रयासों की पूरी जानकारी ली।
उन्होनें पुन: केंद्र की सहायता एवं सहयोग से, दिल्लीवासियों के हित में हर सम्भव कार्य करने के निर्देश दिये।— LG Delhi (@LtGovDelhi) July 15, 2023