4th Phase ఎన్నికలు : ఓటేసిన ప్రముఖులు

  • Published By: madhu ,Published On : April 29, 2019 / 03:29 AM IST
4th Phase ఎన్నికలు : ఓటేసిన ప్రముఖులు

Updated On : April 29, 2019 / 3:29 AM IST

నాలుగో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఏప్రిల్ 29వ తేదీ సోమవారం..9 రాష్ట్రాల్లోని 71 లోక్‌సభ స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. నాలుగో విడత ఎన్నికల బరిలో 961 మంది అభ్యర్థులు ఉండగా… మొత్తం 12.79 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల్లో పలువురు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. క్యూ లైన్లో నిలబడి వారు ఓటు వేశారు. ప్రతొక్కరూ ఓటు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. 

నాల్గవ విడత ఎన్నికలలో ప్రజలు ఓటుహక్కు వినియోగించుకోవాలని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కోరారు. గడిచిన మూడు విడతల పోలింగ్ శాతం రికార్డు బద్దలు కొట్టేలా ఓటు శాంతం పెంచాలని ప్రజలకు సూచించారు. 

ముంబైలో అందాలనటి రేఖ ఓటు హక్కు వినియోగించుకున్నారు. క్యూలో వెళ్లిన రేఖ బాద్రాలోని 283 పోలింగ్ బూత్‌లో ఓటేశారు. 
– ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముంబైలోని పెద్దార్ రోడ్డులో ఉన్న పోలింగ్ బూత్‌కు వెళ్లారు. అక్కడ క్యూలో వెళ్లి ఓటు వేశారు. 
– మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్, ఆయన తనయుడు నకుల్ నాథ్ చింద్వారాలోని పోలింగ్ బూత్‌ నంబర్ 17లో వారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రాల హక్కుల కోసం ప్రజలు ఓటు వేయాలని కమల్ నాథ్ పిలుపునిచ్చారు.
– ప్రముఖ నటుడు, గోరఖ్‌పూర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రవికిషన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముంబైలోని గోరెగాన్ బూత్‌లో ఆయన ఓటేశారు. క్యూలో నిల్చొని ఓటు హక్కు వినియోగించుకున్నారు.
– ఉత్తర్ ప్రదేశ్ ఝాన్సీ నియోజకవర్గ బీజేపీ ఎంపీ అభ్యర్థి అనురాగ్ శర్మ, ముంబై నార్త్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఊర్మిళా బాంద్రాలోని బూత్ నెంబర్ 190 ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీజేపీ సిట్టింగ్ ఎంపీ పరేష్ రావల్ జమ్నా బాయి స్కూల్‌లో ఓటు వేశారు.