Dead Bodies: గంగలో మరోసారి కుప్పలు తెప్పలుగా కోవిడ్‌ మృతదేహాలు..

కరోనా సెకండ్ వేవ్ సమయంలో భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే గంగానదిలో మృతదేహాలు కుప్పలు తెప్పలుగా కొట్టుకు వచ్చిన సంగతి తెలిసిందే.

Dead Bodies: గంగలో మరోసారి కుప్పలు తెప్పలుగా కోవిడ్‌ మృతదేహాలు..

Dead Bodies

Updated On : June 26, 2021 / 12:09 PM IST

Ganga river rises up dead bodies: కరోనా సెకండ్ వేవ్ సమయంలో భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే గంగానదిలో మృతదేహాలు కుప్పలు తెప్పలుగా కొట్టుకు వచ్చిన సంగతి తెలిసిందే. కరోనా సోకినవారు చనిపోతే, వారి మృతదేహాలను నదుల్లో విసిరేశారు. నదీ తీరప్రాంతాల్లో పూడ్చిపెట్టారు. వందల కొద్దీ మృతదేహాలు గంగానదిలో తేలుతూ కనిపించగా.. నదీ తీరంలోని ఇసుకలో మృతదేహాలను పూడ్చడమే ఇందుకు కారణం అయ్యింది. దీంతో నది పరిసరాల్లో నివసించేవారు కోవిడ్-19 సోకుతుందేమోనని భయపడ్డారు.

అయితే, కొంతకాలానికి అదంతా సర్ధుకోగా.. ఇప్పుడు మరోసారి ఉత్తరాదిలో గంగా నదీ పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో నది ఒడ్డు కరిగి ఇసుకతోపాటు వాటిలో ఇటీవల పూడ్చిన మృతదేహాలు కొట్టుకుని నదిలోకి వస్తున్నాయి. గత రెండు, మూడు రోజుల నుంచి ప్రయాగ్‌రాజ్‌గా పిలిచే అలహాబాద్‌ సమీపంలో చాలా మృతదేహాలు తేలుతూ కనిపిస్తున్నాయి.

పలువురు వీటి వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. నీటిలో కొట్టుకొస్తున్న మృతదేహాల్లో కొన్నింటికి చేతులకు గ్లౌజులు, ముఖానికి ఆక్సిజన్‌ పైపులు ఉన్నట్లు గుర్తించారు. దీంతో మృతుల్లో పలువురు కోవిడ్‌ బాధితులు ఉన్నట్లు అర్థం అవుతోంది.

గడిచిన రెండు నెలల్లో భారత్‌లో కరోనావైరస్ విజృంభించగా.. లక్షల్లో మరణాలు సంభవించాయి. నదీ తీరాల్లోని శ్మశాన ఘాట్‌లలో 24 గంటలూ మృతదేహాలు కాలిన సంధర్భాలూ ఉన్నాయి. మరోవైపు శ్మశానాల్లో శవాలను పూడ్చేందుకు చోటు కూడా సరిపో గంగా నది తీరంలో పూడ్చేసేవారు. ఇలా నదీ తీరాల్లో పూడ్చిన శవాలే, పరిసరాల్లోని స్థానికులకు ఆందోళన కలిగిస్తున్నాయి. వర్షం పడడంతో శవాలన్నీ బయటకు కొట్టుకుని వస్తున్నాయి.