పద్మ అవార్డులు ప్రదానం చేసిన రాష్ట్రపతి

  • Published By: chvmurthy ,Published On : March 11, 2019 / 06:22 AM IST
పద్మ అవార్డులు ప్రదానం చేసిన రాష్ట్రపతి

Updated On : March 11, 2019 / 6:22 AM IST

ఢిల్లీ :  2019  పద్మ అవార్డుల ప్రదానోత్సవం  రాష్ట్ర పతి  భవన్లోని  దర్బార్ హాలులో సోమవారం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ 2019 పద్మ  అవార్డులను విజేతలకు ప్రదానం చేశారు. 112 మంది విజేతల్లో  ఈరోజు  56 మందికి ఆయన  పురస్కారాలు అందచేశారు.  మిగిలిన వారికి  మార్చి 16 న జరిగే కార్యక్రమంలో అందచేస్తారు. 
సోమవారం పద్మ అవార్డులు  అందుకున్న  వారిలో సినీ నటుడు  మోహన్ లాల్, ప్రభుదేవా,  సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్, కబడ్డీ ఆటగాడు అజయ్ ఠాకూర్ ,  టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు శరత్ కమాల్,  చెస్ గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక,  వంటి వారు ఉన్నారు.