Presidential Election 2022 : మరోసారి ప్రతిపక్షాల సమావేశం, రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం

రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి అభ్యర్థి ఎంపికపై మంగళవారం మరోసారి ప్రతిపక్ష పార్టీలు సమావేశం కానున్నాయి. ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిని ప్రతిపక్షాలు ఖరారు చేయనున్నాయి.

Presidential Election 2022 : మరోసారి ప్రతిపక్షాల సమావేశం, రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం

Presidential Election 2022

Updated On : June 20, 2022 / 8:14 PM IST

Presidential Election 2022 : రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి అభ్యర్థి ఎంపికపై మంగళవారం మరోసారి ప్రతిపక్ష పార్టీలు సమావేశం కానున్నాయి. ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిని ప్రతిపక్షాలు ఖరారు చేయనున్నాయి. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నేతృత్వంలో ప్రతిపక్ష పార్టీల నేతలు సమావేశం కానున్నారు.

మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు పార్లమెంట్ అనెక్స్‌ భవనంలో సమావేశం జరగనుంది. ప్రతిపక్షాల సమావేశానికి 17 పార్టీల నేతలు హాజరుకానున్నారు. ఇప్పటికే ప్రతిపక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా ఉండేందుకు శరద్ పవార్, ఫారూక్ అబ్దుల్లా, గోపాల కృష్ణ గాంధీ నిరాకరించారు.

Presidential race: రాష్ట్రపతి రేసు నుంచి గోపాల క్రిష్ణ ఔట్!

రేపటి ప్రతిపక్ష పార్టీల సమావేశంలో కాంగ్రెస్, టీఎంసీ, సిపిఐ, సిపిఐ(ఎం), సిపిఐఎంఎల్, ఆర్‌ఎస్‌పి, శివసేన, ఎన్‌సిపి, ఆర్‌జెడి, ఎస్‌పి, నేషనల్ కాన్ఫరెన్స్, పిడిపి, జెడి(ఎస్), డిఎంకె, ఆర్‌ఎల్‌డి, ఐయుఎంఎల్, జెఎంఎం పార్టీల నేతలు పాల్గొననున్నారు. కాగా, జూన్ 15న కాన్ స్టిట్యూషన్ క్లబ్ లో జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశానికి 17 పార్టీల నేతలు హాజరయ్యారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

జూన్ 15న ప‌శ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ఆధ్వర్యంలో విప‌క్షాల స‌మావేశం జరిగింది. జూలైలో జ‌రిగే రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలపాల‌ని నిర్ణయించారు. ఉమ్మడి అభ్యర్థి కోసం ఏకాభిప్రాయ సాధ‌న‌కు మ‌మ‌తా బెన‌ర్జీ కృషి చేస్తున్నారు. దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చి 75 ఏళ్లు పూర్తవున్న సంద‌ర్భంగా భార‌త ప్రజాస్వామ్య, సామాజిక వ్యవ‌స్థకు న‌ష్టం క‌లుగ‌కుండా మోదీ స‌ర్కార్‌ను నిలువ‌రించ‌డానికి భార‌త రాజ్యాంగ ప‌రిర‌క్షకుడిగా ఉండే వ్యక్తిని రాష్ట్రప‌తిగా ఎన్నుకోవాల‌ని విపక్షాలు నిర్ణయించాయి.

presidential elections: రాష్ట్రప‌తి ఎన్నిక‌ అభ్య‌ర్థి రేసు నుంచి త‌ప్పుకుంటున్నాను: ఫ‌రూఖ్ అబ్దుల్లా