PM Modi : నేడు స్టార్టప్ కంపెనీల ప్రతినిధులతో ప్రధాని మోదీ సమావేశం
దేశంలో నూతన ఆవిష్కరణలను నడపడం ద్వారా స్టార్టప్‌లు జాతీయ అవసరాలకు ఎలా దోహదపడతాయో అర్థం చేసుకునేందుకు ఈ భేటీ లక్ష్యమని ప్రధాని కార్యాలయం వెల్లడించింది.

Modi
representatives of startup companies : కేంద్ర ప్రభుత్వం స్టార్టప్‌లపై దృష్టి సారించింది. పలు రంగాల్లోని స్టార్టప్‌లకు ఊతమిచ్చేందుకు స్వయంగా ప్రధానమంత్రి మోదీనే రంగంలోకి దిగారు. దీనిలో భాగంగా ప్రధాని మోదీ ఇవాళ 150 స్టార్టప్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ భేటీ కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో ఎంటర్‌ప్రైజ్ సిస్టమ్స్, స్పేస్, సెక్యూరిటీ, ఫిన్‌టెక్, వ్యవసాయం, ఆరోగ్యం, పర్యావరణం పలు రంగాలకు చెందిన స్టార్టప్‌ల ప్రతినిధులు పాల్గొననున్నారు.
ప్రతి బృందం ఇంటరాక్షన్‌లో కేటాయించిన థీమ్‌పై ప్రధాని మోదీ ఎదుట ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. దేశంలో నూతన ఆవిష్కరణలను నడపడం ద్వారా స్టార్టప్‌లు జాతీయ అవసరాలకు ఎలా దోహదపడతాయో అర్థం చేసుకునేందుకు ఈ భేటీ లక్ష్యమని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా జనవరి 10 నుంచి16 తేదీలలో DPIIT, వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ద్వారా సెలబ్రేటింగ్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ అనే వారం రోజుల కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
Disaccord BJP : బీజేపీలో అసమ్మతి రాగం.. బండి సంజయ్ సొంత జిల్లా కరీంనగర్‌లోనే
ఈ కార్యక్రమం స్టార్టప్ ఇండియా ఆరవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్నారు. స్టార్టప్‌ల అభివృద్ధి, ఆర్థికపరమైన విషయాలు, ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు, భవిష్యత్తు సాంకేతికత, ప్రపంచస్థాయిలో భారతదేశాన్ని అగ్రగ్రామిగా నిలిపే అంశాల ఆధారంగా ఆరు వర్కింగ్ గ్రూపులుగా స్టార్టప్‌లను విభజించారు.