దేశంలోనే ఫస్ట్ : డ్రైవర్‌లెస్‌ ట్రైన్‌

దేశంలోనే ఫస్ట్ : డ్రైవర్‌లెస్‌ ట్రైన్‌

Updated On : December 26, 2020 / 9:37 PM IST

PM Modi will inaugurate driverless metro train : భారత్ లో డ్రైవర్‌లెస్‌ మెట్రో ట్రైన్‌ పట్టాలెక్కనుంది. దేశంలోనే మొట్టమొదటి డ్రైవర్‌లెస్‌ మెట్రో ట్రైన్‌ను ప్రధాని మోడీ సోమవారం ప్రారంభించనున్నారు. ఢిల్లీ మెట్రోలోని 37 కిలోమీటర్ల పొడవైన మెజెంటా మార్గంలో తొలి డ్రైవర్‌లెస్‌ ట్రైన్‌ పరుగులుపెట్టనుంది.

ఈ రైల్‌ నెట్‌వర్క్‌ నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌-జనక్‌పురి వెస్ట్‌ నుంచి నోయిడాలోని బొటానికల్‌ గార్డెన్‌ వరకు విస్తరించి ఉంది. ఫుల్లీ ఆటోమేటెడ్‌ డ్రైవర్‌లెస్‌ రైళ్లు ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా నడువనున్నాయని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.

ఈ కార్యక్రమం తర్వాత సాధారణ ప్రయాణికులకు సేవలు అందుబాటులోకి వస్తాయని ఢిల్లీ మెట్రో అధికారి తెలిపారు.