PM Modi’s Mother Passed Away : ప్రధాని మోదీకి మాతృ వియోగం.. అనారోగ్యంతో హీరాబెన్ కన్నుమూత

ప్రధాని మోదీకి మాతృ వియోగం కలిగింది. ప్రధాని మోదీ తల్లి హీరాబెన్(100) అనారోగ్యంతో కన్నుమూశారు. అహ్మదాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు.

PM Modi’s Mother Passed Away : ప్రధాని మోదీకి మాతృ వియోగం.. అనారోగ్యంతో హీరాబెన్ కన్నుమూత

heeraben dead

Updated On : December 30, 2022 / 10:26 AM IST

PM Modi’s Mother Passed Away : ప్రధాని మోదీకి మాతృ వియోగం కలిగింది. ప్రధాని మోదీ తల్లి హీరాబెన్(100) అనారోగ్యంతో కన్నుమూశారు. అహ్మదాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను రెండు రోజుల క్రితం ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఇవాళ ఆమె మృతి చెందారు.

ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. హీరాబెన్ వయస్సు 100 సంవత్సరాలు. ఇటీవలే ఆమె తన వందో పుట్టిన రోజు జరుపుకున్నారు. ఆ సందర్భంగా మోదీ తన తల్లి అశీస్సులు కూడా తీసుకున్నారు. హీరాబెన్ ఆమె చిన్న కొడుకు దగ్గర ఉంటున్నారు.

PM Modi Mother 100th Birthday : తల్లి 100వ పుట్టిన రోజు..పాదపూజ చేసి ఆశీర్వాదం తీసుకున్న ప్రధాని మోడీ

తల్లి మరణవార్తతో ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ కు వెళ్లారు. అయితే షెడ్యూల్ ప్రకారం నేడు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.