ప్రియాంకపై మంత్రి నోటి దురుసు : పప్పూకీ పప్పీ ఏం చేస్తారు

వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్‌శర్మ మరోసారి తన నోటికి పనిచెప్పారు.

  • Published By: veegamteam ,Published On : March 19, 2019 / 06:57 AM IST
ప్రియాంకపై మంత్రి నోటి దురుసు : పప్పూకీ పప్పీ ఏం చేస్తారు

వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్‌శర్మ మరోసారి తన నోటికి పనిచెప్పారు.

నోయిడా : వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్‌శర్మ మరోసారి తన నోటికి పనిచెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని పప్పూగా, ప్రియాంక గాంధీని పప్పూ కీ పప్పీ అంటు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను ప్రధాని అవుతానని పప్పూ (రాహుల్ గాంధీ) కలలు కంటున్నాడనీ..ఇకపోతే పప్పూకీ పప్పూ (ప్రియాంకా గాంధీ) ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి నానా హంగామా చేస్తున్నారని యూపీలోని తన నియోజకవర్గ కేంద్రమైన సికందరాబాద్‌లో శనివారం (మార్చి16)న  జరిగిన ఎన్నికల సభలో మహేశ్‌శర్మ మాట్లాడుతూ..ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితికి కొత్తగా ఆమె వచ్చి చేసేది ఏముందంటు వ్యాఖ్యానించారు.
Read Also : న్యూజిలాండ్‌లో కాల్పుల మరువకముందే.. నెదర్లాండ్స్‌లో కాల్పులు

మరోపక్క సీఎంలపై కూడా విరుచుకుపడ్డారు. పశ్చిమబెంగాల్ సీఎం మమత.. కర్ణాటక సీఎం కుమారస్వామిపైనా కూడా  శర్మ అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ సీఎం మమత కథక్ ఆడినా..కర్ణాటక సీఎం కుమారస్వామి పాట పాడినా ఎవరు చూస్తారంటు సంచలన వ్యాఖ్యలు చేశారు. వారికున్నవల్లా..కేవలం 72 లోక్‌సభ సీట్లు. 200 స్థానాలకు పైగా వాళ్లకెలా వస్తాయన్నారు.

దీనికి తోడు  పప్పూ (రాహల్) గారి నేతృత్వంలో విపక్షాలు బలమైన కూటమిని సాధిస్తాయంటా అని ఎద్దేవా చేశారు. గాంధీ-నెహ్రూ కుటుంబం నుంచి ఎందరు వచ్చినా..బీజేపీలో ఉండే ఒక్క పులి (నరేంద్రమోదీ) ముందు వారి ఆటలు సాగవంటు మంత్రి చేసిన వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడుతోంది. మంత్రి వెంటనే క్షమాపణలు చెప్పాలని.. బీజేపీ అతడిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కేంద్ర మంత్రి తన స్థాయిని దిగజార్చుకుని, ఒక మహిళ (ప్రియాంక)పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం సహించరానిదని యూపీ కాంగ్రెస్ నేత ధీరజ్ గుర్జార్ మండిపడ్డారు.

Read Also : మాల్యాకు మాగుంటకు లింకేటి? వైసీపీపై ట్రోలింగ్