Priyanka Gandhi Vadra : గాంధీ కుటుంబంలో ఫస్ట్ టైమ్.. అసెంబ్లీ ఎన్నికల బరిలోకి ప్రియాంక గాంధీ?

తొలిసారి గాంధీ కుటుంబం నుంచి అసెంబ్లీకి పోటీ చేసేందుకు ప్రియాంకగాంధీ వాద్రా సిద్ధమయ్యారా? త్వరలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించారా? అంటే అవుననే అంటున్నాయి..

Priyanka Gandhi Vadra : గాంధీ కుటుంబంలో ఫస్ట్ టైమ్.. అసెంబ్లీ ఎన్నికల బరిలోకి ప్రియాంక గాంధీ?

Priyanka Gandhi Vadra

Updated On : September 15, 2021 / 6:46 PM IST

Priyanka Gandhi Vadra : తొలిసారి గాంధీ కుటుంబం నుంచి అసెంబ్లీకి పోటీ చేసేందుకు ప్రియాంకగాంధీ వాద్రా సిద్ధమయ్యారా? త్వరలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించారా? అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. ప్రియాంక గాంధీ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగనున్నారుని తెలుస్తోంది. కాంగ్రెస్‌కు పట్టున్న రాయ్‌బరేలి లేదా అమేథి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకదాని నుంచి నామినేషన్‌ వేసేందుకు ప్రియాంక నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Surgical Masks : సర్జికల్‌ మాస్కులే మంచివి, కరోనా వ్యాప్తికి చెక్

కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీగా, యూపీ ఇంఛార్జీగా ఉన్న ప్రియాంక వాద్రా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ, ఇప్పటివరకు ఎన్నికల్లో పోటీ చేయలేదు. ప్రియాంక వాద్రా పోటీ చేయడం ద్వారా ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ బలపడేందుకు అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటివరకు గాంధీ కుటుంబం నుంచి అసెంబ్లీకి పోటీచేసిన వారు ఎవరూ లేరు. ప్రియాంక పోటీ చేస్తే తొలి వ్యక్తి అవుతారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ.. ఇలా అందరూ లోక్‌సభ ఎన్నికల్లోనే పోటీచేశారు. ప్రియాంక మాత్రం యూపీ అసెంబ్లీపైనే కొన్నాళ్లుగా పనిచేస్తున్నారు. అమేథి లేదా రాయ్‌బరేలీ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి.

కరోనా మన జీవితాల్లో భాగంగా ఉండిపోతుందా? పెరుగుతున్న డెల్టా వేరియంట్ కేసులకు ఇదే నిదర్శనమా?

అదే సమయంలో అమేథి లోక్‌సభపై ప్రియాంక గురి పెట్టారని మరికొందరు చెబుతున్నారు. దీనికి కారణం గత లోక్‌సభ ఎన్నికల్లో సోదరుడు రాహుల్‌గాంధీ ఓటమే. ఆ ఓటమికి బదులు తీర్చుకోవాలన్న కసితో ప్రియాంక ఉన్నారని, 2024 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని వారంటున్నారు.