Sparks Controversy : మహ్మద్ ప్రవక్తపై బీహార్ విద్యాశాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు

మహ్మద్ ప్రవక్తపై బీహార్ విద్యాశాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహ్మద్ ప్రవక్త మర్యాద పురుషోత్తముడని బీహార్ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ తాజాగా వ్యాఖ్యలు చేశారు....

Sparks Controversy : మహ్మద్ ప్రవక్తపై బీహార్ విద్యాశాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు

Bihar Education Minister

Updated On : September 9, 2023 / 12:37 PM IST

Bihar Education Minister : మహ్మద్ ప్రవక్తపై బీహార్ విద్యాశాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహ్మద్ ప్రవక్త మర్యాద పురుషోత్తముడని బీహార్ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ తాజాగా వ్యాఖ్యలు చేశారు. ( Bihar Education Minister Sparks Controversy) శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా బాబా అభయనాథ్ ధామ్ ఆవరణలోని నలందాలోని హిల్సా సబ్ డివిజన్‌లో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. ‘‘ప్రపంచంలో చెడుతనం పెరిగిపోతోంది, నిజాయితీ అంతమైపోతోంది, మోసగాళ్లు, దుర్మార్గుల సంఖ్య పెరిగిపోయింది… దీంతో దేవుడు మర్యాద పురుషోత్తముడైన మహమ్మద్ సాహెబ్‌ను భూమిపైకి పంపారు’’ అని మంత్రి చంద్రశేఖర్ పేర్కొన్నారు. (Prophet Muhammad Was Maryada Purushottam) ఈ కార్యక్రమంలో రాష్ట్ర కళా, సాంస్కృతిక శాఖ మంత్రి జితేంద్ర రాయ్‌, కార్మిక వనరుల శాఖ మంత్రి సురేంద్ర రామ్‌, సైన్స్‌, సమాచార శాఖ మంత్రి మహ్మద్‌ ఇస్రాయిల్‌ మన్సూరి, హిల్సా మాజీ ఎమ్మెల్యే, పార్టీ అధికార ప్రతినిధి శక్తి సింగ్‌ యాదవ్‌, మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్‌ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

G20 Summit live updates: అట్టహాసంగా ప్రారంభమైన జీ-20 సమావేశం

విద్యాశాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి నిఖిల్ ఆనంద్ స్పందించారు. మంత్రి చంద్రశేఖర్ జన్మాష్టమి కార్యక్రమంలో శ్రీకృష్ణుడి పవిత్రతను కించపరిచే ప్రయత్నం చేశారని ఆనంద్ ఆరోపించారు. విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ హిందూ-సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానించినా, శ్రీరాముడు,శ్రీకృష్ణ భగవానుని కించపరిచే పదజాలం వాడినా, అది రాష్ట్రీయ జనతాదళ్ మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుందని ఆనంద్ పేర్కొన్నారు.

Saina Nehwal : ఉజ్జయిని మహాకాలేశ్వర్ దేవాలయంలో సైనా నెహ్వాల్ పూజలు

ప్రతిపక్ష కూటమి హిందూ సనాతన ధర్మాన్ని ఎలా అవమానించాలో, ఇస్లాం అనుకూల, పాకిస్థాన్ అనుకూల భావనలు చేస్తూ తమ ఓటు బ్యాంకును ఎలా ప్రసన్నం చేసుకోవాలో దేశవ్యాప్తంగా ప్రచారం ప్రారంభించిందని బీజేపీ నేత ఆరోపించారు. మంత్రి చంద్రశేఖర్ హిందూ సనాతన ధర్మం పట్ల విముఖత కలిగి ఉంటే, మహమ్మద్ సాహెబ్ ఉనికితో పోల్చి శ్రీకృష్ణుని ఉనికిని చూడలేకపోతే, అతను మౌలానా టోపీని ధరించాలి, నమాజ్ చేయాలని ఆనంద్ సూచించారు. మంత్రి సున్తీ చేయించుకుని, పాకిస్థాన్‌కు వెళ్లండని ఆనంద్ కోరారు.