Punjab CM Bhagwant Mann: పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పై ఆయన కుమార్తె సంచలన వ్యాఖ్యలు .. వీడియో విడుదల
నేను, నా తల్లి చాలాకాలం పాటు మౌనంగా ఉన్నాము. మా మౌనాన్ని మా బలహీనతగా భావించినట్లు నేను భావిస్తున్నాను. మా మౌనం కారణంగా అతను ప్రస్తుతం ఉన్నత స్థానంలో కూర్చున్నాడని అతనికి తెలియదు అంటూ సీరత్ పేర్కొంది.

Bhagwant Mann
CM Bhagwant Mann Daughter : పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పై ఆయన కుమార్తె సీరత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అతను చాలాకాలం నుంచి ‘పాపా’ అని పిలిచే హక్కును కోల్పోయాడని పేర్కొంది. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో తండ్రిపై సీరత్ కౌర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. అయితే, ఈ వీడియో చేయడం వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని, నా కథ బయటకు రావాలని కోరుకుంటున్నానని ఆమె తెలిపింది.
Also Read : Fighter Crash : దక్షిణ కొరియాలో కూలిపోయిన యూఎస్ ఎఫ్ 16 ఫైటర్ జెట్
పంజాబ్ సీఎం భగవంత్ తన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశాడని సీరత్ కౌర్ మాన్ ఆరోపించింది. మొదటి నుంచి నా తండ్రి అసత్యాలు చెబుతూనే కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పుడుకూడా అదే చేస్తున్నారు. మా అమ్మను ఎమోషనల్ గా బలహీనపరిచినట్లే పంజాబ్ ప్రజలను బలహీన పరుస్తున్నాడంటూ సీరత్ కౌర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ విధాన సభకు, గురుద్వారా సాహెబ్ కు కూడా మద్యం మత్తులోనే వెళ్తున్నారు. సొంత పిల్లలకే న్యాయం చేయలేని వ్యక్తి.. రాష్ట్రానికి ఏం మంచి చేస్తారు? అంటూ వీడియోలో సీరత్ కౌర్ ప్రశ్నించారు.
నేను, నా తల్లి చాలాకాలం పాటు మౌనంగా ఉన్నాము. మా మౌనాన్ని బలహీనతగా భావించినట్లు నేను భావిస్తున్నాను. మా మౌనం కారణంగా అతను ప్రస్తుతం ఉన్నత స్థానంలో కూర్చున్నాడని అతనికి తెలియదు అంటూ సీరత్ పేర్కొంది. ఈ వీడియోలో సీఎం మాన్ భార్య డాక్టర్ గుర్కీరత్ గర్భవతి అని, సీఎం మాన్ మూడోసారి తండ్రి కాబోతున్నారని సీరత్ తెలియజేసింది. ఈ విషయం తనకు ఇతరుల నుంచి తెలిసిందని సీరత్ తెలిపింది. ఈ విషయాన్ని తనకు లేదా తన సోదరుడికి తెలియజేయడానికి కూడా మాన్ పట్టించుకోలేదని సీరత్ పేర్కొంది. నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.. కానీ, వాళ్లను నిర్లక్ష్యం చేసి ఇప్పుడు మూడో వాడిని ఈ ప్రపంచంలోకి తీసుకురావాలనుకుంటున్నావు. దీనికి కారణం ఏమిటని సీరత్ తన తండ్రి భగవంత్ మాన్ ను ప్రశ్నించింది.
Also Read : Cyber Criminals : నదిలో దూకిన సైబర్ నేరగాళ్లు…వెంటాడి పట్టుకున్న పోలీసులు
సీఎం మాన్ ని కలిసేందుకు సీఎం కుమారుడు దోషన్ రెండుసార్లు పంజాబ్ వెళ్లాడని సీరత్ తెలిపింది. అతను తన తండ్రితో సమయం గడపాలని కోరుకున్నాడు.. అయితే, అతన్ని సీఎం ఇంటికి రానివ్వలేదు. రెండుసార్లు ఇలానే జరిగింది. ఆ తరువాత దోషన్ చండీగఢ్ లో కుటుంబ స్నేహితులతో కలిసి ఉన్నాడు. ఒకరోజు అతను సీఎం ఇంటికి వెళ్లాడు.. అతన్ని ఇంటి బయటకు నెట్టివేశారని సీరత్ పేర్కొంది. సొంత పిల్లల బాధ్యత తీసుకోలేని వ్యక్తి పంజాబ్ ప్రజల బాధ్యత ఎలా తీసుకుంటాడు అంటూ సీరత్ వీడియోలో ప్రశ్నించింది.
సీరత్ కౌర్ వీడియోను ఆమె తల్లి, భగవంత్ మాన్ మొదటి భార్య ఇందర్ ప్రీత్ కౌర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ క్రమంలో ఆమెసైతం మాజీ భర్తపై విమర్శల వర్షం కురిపించారు. తల్లిదండ్రులు విడిపోయిన తర్వాత సీరత్ 2015లో అమెరికాకు వెళ్లింది. ఆమె తల్లి పేరు ఇంద్రప్రీత్ కౌర్. సోదరుడు దిల్షన్ మాన్ ఉన్నాడు. ఆమె ఇల్లు అమెరికాలోని వాషింగ్టన్‌లోని సీటెల్‌లో ఉంది. ఆమె సవతి తల్లి డాక్టర్ గురుప్రీత్ కౌర్.
https://twitter.com/TajinderBagga/status/1733505297921212643?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1733505297921212643%7Ctwgr%5E32a2cfaec958f780ac5dd086826763a66c214efb%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.freepressjournal.in%2Findia%2Fpunjab-cm-manns-daughter-accuses-father-of-neglect-throwing-brother-out-of-his-house-drinking-abuse-are-his-habits-video