Punjab govt : ప్రభుత్వ స్కూళ్లకు కులం పేర్లు తొలగింపు .. ఆప్ సర్కార్ కీలక నిర్ణయం
పంజాబ్ లోని ఆప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ స్కూళ్లకు ఉండే వ్యక్తుల పేర్లకు ఉండ కులాల పేర్లను తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పంజాబ్ లోని 56 ప్రభుత్వ స్కూళ్లకు ఉండే వ్యక్తుల కులాల పేర్లను తొలగించింది.

Punjab Govt renames 56 govt schools with caste tag..
Punjab govt : పంజాబ్ లోని ఆప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ స్కూళ్లకు ఉండే వ్యక్తుల పేర్లకు ఉండ కులాల పేర్లను తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పంజాబ్ లోని 56 ప్రభుత్వ స్కూళ్లకు ఉండే వ్యక్తుల కులాల పేర్లను తొలగించే నిర్ణయిం తీసుకుంది. స్కూల్ అనేది కులాలను గుర్తు చేసేదిగాను.కులాల వైషమ్యాలను విద్యార్దుల్లో రేకెత్తించేదిగా ఉండకూడని భావించిన ఆప్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. స్కూల్లో పేద గొప్పా తేడా అనేది ఎలా ఉండకూడదో అలాగే కులాల గుర్తింపులు కూడా ఉండకూడని భావించింది. దీంట్లో భాగంగానే ప్రభుత్వం స్కూళ్లకు ఉండే వ్యక్తుల కులాల పేర్లను తొలగించే నిర్ణయం తీసుకుంది. వాటి స్థానంలో స్థానిక అమరవీరుల పేర్లను పునఃనామకరణం చేసింది.
ప్రభుత్వ స్కూళ్లకు వ్యక్తుల పేర్లు కులాల పేర్లు ఉండటమేంటీ అనుకోవచ్చు.ఎందుకంటే చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ స్కూళ్ల నిర్మాణానికి కొంతమంది దాతలు దానం చేసిన స్థలాల్లో స్కూళ్ల నిర్మాణాలు ఉంటాయి. స్కూళ్ల భవన నిర్మాణాలకు కూడా పలువురు దాతలు ధన సహాయం చేసిన ఉంటారు. వారి పేర్లను స్కూళ్లకు పెడుతుంటారు. అలా భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో ఇటువంటివి చాలానే ఉన్నాయి. స్థల దాతలు, భవన నిర్మాణానికి విరాళాలు ఇచ్చిన వారి పేర్లను స్కూళ్లకు పెడుతుంటారు ఆయా దాతలకు గుర్తుగా..
ఈ క్రమంలో పంజాబ్ లోని ఆప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటూ స్కూళ్ల పేరులో కులాన్ని, వర్గాన్ని సూచించే పేరు ఉండకూడదని ఉంటే వాటిని తొలగించాలని తీర్మానించింది. స్కూల్ వాతావరణం అనేది సమానత్వానికి ప్రతీకగా ఉండాలని..స్కూళ్ల పేర్లు ప్రత్యేకంగా ఒక కులాన్నో, వర్గాన్నో సూచించే విధంగా ఉండకూడదని ఆప్ ప్రభుత్వం భావించింది. దీంట్లో భాగంగానే 56 స్కూళ్లకు ఉన్న పేర్లను తొలగించాలని నిర్ణయించిందని పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్ జోత్ సింగ్ పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలకు కులం, వర్గం పేర్లు ఉంటే అది విద్యార్థుల్లో కుల భావాలని పెంచుతుందని అటువంటి భావన వారితో పాటు పెగుతుందని అటువంటి భావన మంచిది కాదని..సమాజంలో కులవిభజనకు కారణమవుతుందని అభిప్రాయపడింది ఆప్ సర్కారు. అందుకనే కులం, వర్గాన్ని సూచించే పేర్లను మార్చాలని ఆదేశాలు ఇచ్చామని మంత్రి తెలిపారు.
పంజాబ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి పేర్లను కలిగి ఉన్న ప్రభుత్వ స్కూళ్లను వాటికి ఉన్న కులం, వర్గాన్ని సూచించే పేర్లు గుర్తించారు అధికారులు. వారం రోజుల్లో ఈ 56 ప్రభుత్వ పాఠశాలలకు కులాన్ని సూచించే పేర్లను తొలగించారు. ఆ పేర్ల స్థానంలో స్థానిక అమరవీరులు, లేదా ప్రముఖ వ్యక్తి పేర్లను పెట్టారు. అలా ఆ స్కూళ్లకు పునఃనామకరణం చేశారు.