మరికొద్దిసేపట్లో తెరుచుకోనున్న జగన్నాథుడి రత్న భాండాగారం.. ప్రారంభమైన పూజలు
ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం మరికొద్ది గంటల్లో తెరుచుకోనుంది. 46 సంవత్సరాల తరువాత సంపద లెక్కింపు చేయనున్నారు.

Puri Jagannath Temple
Puri Jagannath Ratna Bhandar : ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం మరికొద్ది గంటల్లో తెరుచుకోనుంది. 46 సంవత్సరాల తరువాత సంపద లెక్కింపు చేయనున్నారు. ఇందుకోసం ఒడిశా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. కొద్దిసేపట్లో జగ్ననాథ ట్రస్ట్ బోర్డు, ఆలయ వేద పండితులు భేటీ కానున్నారు. ఆలయ ప్రవేశ ముహూర్తంను ట్రస్ట్ సభ్యులు ఖరారు చేస్తారు. మధ్యాహ్నం 1గంటలకు శుభముహూర్తం ఉందని వేద పండితులు చెబుతున్నారు. మరోవైపు రత్న భాండాగారం తెరుస్తుండటంపై దేశవ్యాప్తంగా ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
Also Read : అపార సంపద చుట్టూ అంతుచిక్కని నాగబంధం.. ఆదిశేషుడే విష్ణుమూర్తి సంపదకు కాపలాగా ఉన్నాడా!?
ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం తెరవాలని జస్టిస్ బిశ్వనాథ్ రథ్ అధ్యక్షతన 16మందితో ఏర్పాటు చేసిన కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఇవాళ మధ్యాహ్నం రహస్య గదిని తెరవనున్నారు. సోమనాథ్ కమిటీ, జగన్నాథ్ ట్రస్ట్ కమిటీ, రిజర్వ్ బ్యాంక్ అధికారులు ఆలయం వద్దకు చేరుకున్నారు. రహస్య గదిలోకి 16 మంది సభ్యుల బృందం వెళ్లనుంది. నిపుణుల పర్యవేక్షణలో రత్న భాండాగారంను అధికారులు తెరవనున్నారు. భాండాగర్ లో విష సర్పాలు ఉండే అవకాశం ఉండటంతో నిపుణులైన స్నేక్ క్యాచర్స్ ను ప్రభుత్వం పిలిపించింది.
Also Read : పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం.. రహస్య గదిలో 5 చెక్కపెట్టెల్లో విలువైన ఆభరణాలు
ప్రారంభమైన పూజలు..
పూరి రత్న భండాగారంకు పూజలు ప్రారంభమయ్యాయి. రత్న భండాగారంకు రక్షణగా ఉన్న లోక్ నాథ్ దేవ్ కి, నాగదేవత కి వేద పండితులు పూజలు చేయనున్నారు. అనంతరం పూరి జగన్నాథ్ క్షేత్రంకు రక్షణగా ఉన్న శివ దేవుడు, లోక్ నాథ్ దేవ్, శివ దేవ్, నాగదేవత అనుమతి తీసుకోనున్న పండితులు. ప్రత్యేక పూలమాలతో శాక్షోత్రంగా పూజలు నిర్వహించనున్న పండితులు. పూరి ఆలయానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బలగాలు. భండాగారం ఆలయ గది తలుపు తెరుచుకోకపోతే ప్రజెర్ మిషన్ ని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సిద్ధం చేశారు. అంతేకాక.. భారీ సెర్చ్ లైట్స్, ఇతర పరికరాలను సిద్ధం చేసుకున్నారు.