గోవాలో రాహుల్ ఎంజాయ్ : టూరిస్ట్ లతో సెల్ఫీలు

పనాజీ: కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ గోవా తీరంలో ఎంజాయ్ చేస్తున్నారు. ఐదు రాష్ట్రాలో అసెంబ్లీ ఎన్నికలు..అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లో తీసుకోవాల్సిన చర్యలు..వెంటనే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు, పార్టీ కార్యక్రమాలతో గత కొంతకాలంగా బిజీ బిజీగా గడిపిన రాహుల్ గాంధీ తల్లి సోనియా గాంధీతో కలిసి జనవరి 27న గోవా టూర్ వచ్చారు. ఎటువంటి సెక్యూరిటీ లేకుండానే కామన్ మాన్ గానే గోవాలో ఎంజాయ్ చేస్తున్నారు.సౌత్ గోవాలో సీఫుడ్‌కు పేరుగాంచిన వార్ఫ్ రెస్టారెంట్‌కు సోనియాతో కలిసి రాహుల్ లంచ్ చేశాడు. ఈ సందర్భంగా అక్కడివచ్చిన పలువురు టూరిస్ట్ లు రాహుల్‌తో ఫొటోలు..సెల్ఫీల కోసం ఎగబడ్డారు. వారితో పాటు రాహుల్ కూడా వారితో సరదా సరదాగా గడిపారు.
గోవాకు చెందిన ఫేమస్ డెంటిస్ట్ రచనా ఫెర్నాండెజ్ తన బంధువులతో కలిసి అదే రెస్టారెంట్‌కు భోజనం చేసేందుకు వచ్చారు. అక్కడే రాహుల్ కనబడటంతో అతనితో సెల్ఫీ దిగి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. మీతో(రాహుల్) ఫొటో దిగాలని ఉందని నేను అడగ్గానే.. బిల్లు కట్టి వచ్చిన తర్వాత సెల్ఫీ దిగుతానని తనతో రాహుల్ చెప్పారని ఫెర్నాండెజ్ తెలిపారు.