Rahul Gandhi: ‘కాంగ్రెస్ ప్రెసిడెంట్ కాకపోయినా రాహుల్ అన్ని నిర్ణయాలు తీసేసుకుంటారు

ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలను వెలువడ్డ కొన్ని రోజుల్లోనే కాంగ్రెస్ రికవరీ మోడ్ లోకి వెళ్లిపోయింది. పంజాబ్ తో సహా ఐదు రాష్ట్రాల్లో ఏ మాత్రం అధికారంలోకి రాలేకపోయింది. ఈ మేరకు కాం

Rahul Gandhi: ‘కాంగ్రెస్ ప్రెసిడెంట్ కాకపోయినా రాహుల్ అన్ని నిర్ణయాలు తీసేసుకుంటారు

Photopea Online Photo Editor

Updated On : March 15, 2022 / 3:30 PM IST

Rahul Gandhi: ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలను వెలువడ్డ కొన్ని రోజుల్లోనే కాంగ్రెస్ రికవరీ మోడ్ లోకి వెళ్లిపోయింది. పంజాబ్ తో సహా ఐదు రాష్ట్రాల్లో ఏ మాత్రం అధికారంలోకి రాలేకపోయింది. ఈ మేరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఐదు గంటల పాటు సుదీర్ఘ సమావేశాన్ని నిర్వహించింది. మీటింగ్ లో పార్టీ సభ్యులు సోనియా గాంధీ నాయకత్వంపై తమ విశ్వాసాన్ని పునరుద్ఘాటించడంతో పదవి నుంచి వైదొలగకూడదని నిర్ణయించుకున్నారు.

ఈ అంశంపై మాట్లాడిన కపిల్ సిబాల్.. గాంధీ కుటుంబాన్ని కాంగ్రెస్ అధికారం నుంచి తప్పించి వేరొకరికి అప్పగించాలని చెబుతున్నారు.

‘గాంధీ కుటుంబం స్వతహాగా తప్పుకోవాలి. అంతేకానీ వాళ్లు నామినేట్ చేసిన అభ్యర్థులను అడిగి అధికారంలో కంటిన్యూ అవ్వాలనుకోకూడదు’ అని వెల్లడించారు. రాహుల్ గాంధీ పార్టీ చీఫ్గా మళ్లీ అధికారంలోకి రావాలని డిమాండ్ చేస్తున్నారనే అంశంపై స్పందిస్తూ.. రాహుల్ గాంధీ ఒక డిఫెక్టివ్ ప్రెసిడెంట్ అని చెప్తున్నారు.

Read Also: ఆమ్ ఆద్మీ పార్టీ పై రాహుల్ గాంధీ చురకలు, స్పందించిన కేజ్రీవాల్

రాహుల్ గాంధీ పంజాబ్ వెళ్లి చరణ్ జిత్ సింగ్ ను కవలడమేకుండా తర్వతి సీఎం నువ్వేనని చెప్పాడు. అతనే ఉద్దేశ్యంతో అలా చెప్పాడు. అతను పార్టీకి ప్రెసిడెంట్ కాదు. కానీ, అన్ని నిర్ణయాలు తీసుకుంటాడు. తెలిసి తెలిసి మరోసారి అతనికి అన్నిశక్తులు ఇచ్చేందుకు సిద్దమవుతున్నారని కపిల్ సిబాల్ వ్యాఖ్యానించారు.