Rajasthan investment: రూ.60 వేల కోట్ల అదానీ డీల్‌ను సమర్ధించిన రాహుల్ గాంధీ
రాజస్తాన్ రాష్ట్రంలో ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ 60 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారు. 10,000 మెగావాట్ల సౌర విద్యుత్తు తయారీ కేంద్రం, సిమెంటు ప్లాంటు విస్తరణ, జైపుర్ విమానాశ్రయ అభివృద్ధి వంటి ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు తెలిపారు. వాహనాల్లో ఉపయోగించే సీఎన్‌జీ సరఫరాకు కావాల్సిన మౌలిక వసతులు, పరిశ్రమలు, ఇళ్లకు గ్యాస్ పైప్‌లైన్, పునరుత్పాదక ఇంధన సరఫరాకు కావాల్సిన సరఫరా లైన్ల ఏర్పాటు వంటి ప్రాజెక్టుల్లోనూ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు

Rahul Gandhi on Rajasthan investment by Adani
Rajasthan investment: అందానీ, అబానీ అంటూ తరుచూ విమర్శలు గుప్పించే కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ.. ఉన్నట్లుండి అదానీకి చెందిన 60,000 కోట్ల రూపాయల పెట్టబడిని సమర్ధించారు. కారణం, కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో ఆ పెట్టుబడి పెడతుండడమని వేరే చెప్పనక్కర్లేదు. అంతే కాకుండా ఈ పెట్టుబడలపై రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను వెనకేసుకొచ్చారు కూడా. ఇలా పెట్టబడులు వస్తే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కాదనలేరని, ఇది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన అంశమని రాహుల్ వ్యాఖ్యానించడం గమనార్హం.
తాజాగా రాజస్తాన్ రాష్ట్రంలో ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ 60 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారు. 10,000 మెగావాట్ల సౌర విద్యుత్తు తయారీ కేంద్రం, సిమెంటు ప్లాంటు విస్తరణ, జైపుర్ విమానాశ్రయ అభివృద్ధి వంటి ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు తెలిపారు. వాహనాల్లో ఉపయోగించే సీఎన్‌జీ సరఫరాకు కావాల్సిన మౌలిక వసతులు, పరిశ్రమలు, ఇళ్లకు గ్యాస్ పైప్‌లైన్, పునరుత్పాదక ఇంధన సరఫరాకు కావాల్సిన సరఫరా లైన్ల ఏర్పాటు వంటి ప్రాజెక్టుల్లోనూ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు. ‘ఇన్వెస్ట్ రాజస్థాన్ 2022’ పేరిట శుక్రవారం నిర్వహించిన సదస్సులో పాల్గొన్న ఆయన ఈ విషయాలు వెల్లడించారు.
అయితే నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని విమర్శించే క్రమంలో దేశాన్ని అదానికి దోచి పెడుతున్నారంటూ సమయం చిక్కినప్పుడల్లా రాహుల్ విమర్శలు చేస్తున్నారు. అయితే రాజస్తాన్‌లో ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడంపై ఆయనను ప్రశ్నించగా ‘‘అదానీతో గెహ్లాట్ సమావేశం అవ్వడంపై మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి. రాజస్తాన్‌లో పెట్టుబడి పెట్టేందుకు అదానీ ముందుకు వచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా గెహ్లాట్ ఆహ్వానించారు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా పెట్టుబడులను కాదనలేరు. ఇది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన విషయం’’ అని సమాధానం ఇచ్చారు.
Munugode Bypoll: తమ అభ్యర్థిని ప్రకటించిన బీఎస్పీ చీఫ్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్