Viral Video: బహిరంగ సభలో తన తలపై తానే నీళ్లు పోసుకున్న రాహుల్ గాంధీ

Viral Video: ఎండల వేడి ఎక్కువగా ఉండడంతో అక్కడి బాటిల్ తీసుకుని తలపై నీళ్లు పోసుకుని, "గర్మీ హై కాఫీ..." అని..

Viral Video: బహిరంగ సభలో తన తలపై తానే నీళ్లు పోసుకున్న రాహుల్ గాంధీ

Rahul Gandhi

Updated On : May 28, 2024 / 9:31 PM IST

ఎన్నికల వేళ కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభలో తన తలపై తానే నీళ్లు పోసుకున్నారు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను కాంగ్రెస్ పార్టీ తమ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఉష్ణోగ్రత పెరుగుతోందని, ఇండియా బ్లాక్ ప్రభుత్వం రాబోతుందని అందులో కాంగ్రెస్ పేర్కొంది.

ఉత్తరప్రదేశ్‌లోని రుద్రాపూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్‌ గాంధీ పాల్గొన్నారు. ఎండల వేడి ఎక్కువగా ఉండడంతో అక్కడి బాటిల్ తీసుకుని తలపై నీళ్లు పోసుకుని, “గర్మీ హై కాఫీ…” అని అన్నారు. తలపై నీళ్లు పోసుకున్నాక ఆయన కూల్ అయినట్లు కనపడింది. ఆయన ఒక్కసారిగా చేసిన ఈ పనికి కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు ఆశ్చర్యపోయారు.

కాగా, ఇవాల ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. లోక్ సభ ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య జరుగుతున్నాయని అన్నారు. ఒకవైపు ఇండియా కూటమి, రాజ్యాంగం ఉంటే, మరోవైపు రాజ్యాంగాన్ని రద్దు చేయాలనుకునే వారు ఉన్నారని తెలిపారు. బీజేపీ మరోసారి అధికారంలోకి రాదని ఆయన చెప్పారు.

Also Read: కీరవాణి అంతర్జాతీయ స్థాయిలో గొప్ప సంగీత దర్శకుడు.. ఆయనను విమర్శించే హక్కు మీకు లేదు: ఎమ్మెల్యే నాగరాజు