Rahul Gandhi : లాలూతో కలిసి మటన్ వండిన రాహుల్ గాంధీ…వీడియో వైరల్

నిత్యం రాజకీయాలతో బిజీగా ఉండే రాహుల్ గాంధీ రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూప్రసాద్ యాదవ్ తో కలిసి మటన్ వండిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మోదీ వంటగదిలో గరిటె తిప్పిన వీడియో హల్ చల్ చేస్తోంది....

Rahul Gandhi : లాలూతో కలిసి మటన్ వండిన రాహుల్ గాంధీ…వీడియో వైరల్

Rahul Gandhi Prepares Mutton

Updated On : September 3, 2023 / 9:57 AM IST

Rahul Gandhi : నిత్యం రాజకీయాలతో బిజీగా ఉండే రాహుల్ గాంధీ రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూప్రసాద్ యాదవ్ తో కలిసి మటన్ వండిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మోదీ వంటగదిలో గరిటె తిప్పిన వీడియో హల్ చల్ చేస్తోంది. మోదీ ఇంటిపేరుకు సంబంధించిన వ్యాఖ్యలపై పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి విధించిన శిక్షను సుప్రీంకోర్టు తాత్కాలికంగా సస్పెండ్ చేసిన తర్వాత ఆగస్టు 4వతేదీన ఢిల్లీలోని లాలూ ఇంట్లో ఈ వంట సమావేశం జరిగింది. లాలూతో కలిసి మటన్ ముక్కల్లో మసాలా, ఉప్పు, కారం, పసుపు వేసి రాహుల్ గరిటె తిప్పారు. (Rahul Gandhi Prepares Champaran Mutton)

Kuno cheetahs : కునో నేషనల్ పార్క్‌లో చీతాలు మరణాలు సాధారణమే…నమీబియా రాయబారి వ్యాఖ్యలు

మొదటిసారి చంపారన్ మటన్ వండిన రాహుల్ లాలూతో కలిసి భోజనం చేస్తూ రాజకీయాలపై చర్చలు జరిపారు. మటన్ వండిన రాహుల్ వీడియోను కాంగ్రెస్ పార్టీ శనివారం విడుదల చేసింది. లాలూ, మీసాభారతి సలహాపై తానే మటన్ కర్రీ వండానని రాహుల్ వీడియోలో పేర్కొన్నారు. ప్రతీ 15 ఏళ్లకు ఒకసారి బీజేపీ విద్వేషాగ్నిని ప్రచారం చేస్తుందని, దీనిపై రాహుల్ అడగ్గా రాజకీయ ఆకలి తీర్చుకునేందుకు బీజేపీ ఇలా చేస్తుందని చెప్పారు.

Delhi : ఢిల్లీ ప్రజలు 61 కోట్ల మద్యం బాటిళ్లు తాగారు…సర్కారుకు రూ.7,285 కోట్ల ఆదాయం

మీ తల్లిదండ్రులు, తాతలు దేశాన్ని సన్మార్గంలో తీసుకెళ్లిన విషయాన్ని నేటి తరం మరచిపోకూడదని లాలూ ప్రసాద్ యాదవ్ రాహుల్ గాంధీకి సూచించారు. ఇటీవల రాహుల్ గాంధీ బెంగాలీ మార్కెట్, జామా మసీదు, ముఖర్జీ నగర్ వంటి ప్రాంతాల్లో సందర్చించి అక్కడి ప్రజలతో మాట్లాడిన వీడియోలను సోషల్ మీడియాలో ప్రజలతో పంచుకున్నారు. వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించడానికి హర్యానాలోని సోనేపట్‌ వచ్చారు.రాహుల్ హర్యానాలోని ముర్తల్ నుంచి అంబాలా వరకు ట్రక్కులో ప్రయాణించారు. రాహుల్ గాంధీ కరోల్ బాగ్‌లోని బైక్ మార్కెట్, ఆజాద్‌పూర్ కూరగాయల మార్కెట్‌ను కూడా పరిశీలించారు.