Rahul Gandhi : రెండు రోజుల కశ్మీర్ పర్యటనకు రాహుల్ గాంధీ!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెల 9 న జమ్మూ కశ్మీర్‌ లోని శ్రీనగర్ లో పర్యటించనున్నారు.

Rahul Gandhi : రెండు రోజుల కశ్మీర్ పర్యటనకు రాహుల్ గాంధీ!

Rahul (2)

Updated On : August 4, 2021 / 7:50 PM IST

Rahul Gandhi కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెల 9 న జమ్మూ కశ్మీర్‌ లోని శ్రీనగర్ లో పర్యటించనున్నారు. తన శ్రీనగర్ పర్యటనలో.. స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో రాహుల్ కీలక భేటీ నిర్వహించనున్నారు. కాగా, ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసిన తర్వాత జమ్మూ కశ్మీర్‌లో రాహుల్ గాంధీ పర్యటించనుండటం ఇదే మొదటిసారి.

కాగా, గతంలోనే రాహుల్ గాంధీ జమ్మూ కశ్మీర్ ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. జమ్మూ కశ్మీర్‌లో త్వరలోనే పర్యటిస్తానని వారికి రాహుల్ హామీ ఇచ్చారు. ఈ హామీ ప్రకారం రాహుల్ రెండు రోజుల పాటు జమ్మూ కశ్మీర్‌లో బస చేయనున్నారు. అయితే,సోమవారం ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్ లో విపక్ష నేతల అల్పాహార విందు సమావేశంలో.. తాను తర్వలో జమ్మూకశ్మీర్ లో పర్యటించనున్నాను అని రాహుల్ చెప్పినట్లు సమాచారం.