Rail Madad Helpline Number : ‘దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే’ క్లైమాక్స్ సీన్‌తో రైల్వే శాఖ వినూత్న ప్రచారం
రైల్వేకు సంబంధించిన ఫిర్యాదుల కోసం 139 నంబర్ ఎప్పటి నుంచో అందుబాటులో ఉంది. దీనిపై అవగాహన కల్పించడం కోసం గతంలో రైల్వే శాఖ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసింది. తాజాగా మరోసారి వినూత్నంగా ప్రచారం మొదలుపెట్టింది.

Rail Madad Helpline Number
Rail Madad Helpline Number : ట్రైన్ ఎక్కిన తరువాత మీకు ఏదైనా సమస్య ఎదురైందా? సహాయం కోసం ఎవరి కోసం ఎదురు చూడకండి. అన్ని ఫిర్యాదులకు 139 నంబర్ అమలులో ఉంది. అయితే ఈ విషయం కొందరికి తెలియకపోవచ్చు. దీనిపై అవగాహన కల్పించేందుకు రైల్వే శాఖ వినూత్నంగా ముందుకు వచ్చింది. ట్విట్టర్‌లో రైల్వే శాఖ పోస్ట్ చేసిన ట్వీట్ చూస్తే ఆ విషయం మీకు అర్ధమవుతుంది.
Trains Cancelled: ఆ రెండు డివిజన్ల పరిధిలో 20 రైళ్లు రద్దు చేసిన రైల్వే శాఖ .. ఏ తేదీ వరకు అంటే?
రైల్వేకు సంబంధించిన ఫిర్యాదుల కోసం 139 నంబర్ (Railway madad Helpline Number) అందుబాటులో ఉంది. రైలు ప్రయాణానికి సంబంధించిన ఎలాంటి ఫిర్యాదు అయినా ఈ నంబర్‌కు డయల్ చేసేలా ఏర్పాటు చేసారు. 139 నంబర్ ఎలా పనిచేస్తుందంటే? డయల్ చేసిన తరువాత ఐవీఆర్ఎస్ సూచన మేరకు సెల్ ఫోన్లో నంబర్స్ ప్రెస్ చేయాలి. మీకు అవసరమైన సహాయాన్ని సూచించిన నంబర్లను ప్రెస్ చేయడం ద్వారా అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్‌గా స్టార్ బటన్ నొక్కి కాల్ సెంటర్ సిబ్బందితో మాట్లాడవచ్చు. ఈ నంబర్‌కు ఫిర్యాదు చేయాలనుకుంటే స్మార్ట్ ఫోనే అవసరం లేదు.
ఈ నంబర్‌పై అవగాహన కల్పించడం కోసం రైల్వే శాఖ గతంలో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసింది. ఈ నంబర్‌ను ప్రచారం చేయడం కోసం ఈసారి వినూత్నంగా ముందుకు వచ్చింది. ‘దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే’ సినిమాలో క్లైమాక్స్ సీన్‌ను తమ ప్రచారానికి ఉపయోగించుకుంది. ఆ సినిమాలో క్లైమాక్స్‌లో సిమ్రన్‌ను (కాజోల్), రాజ్(షారూఖ్ ఖాన్) దగ్గరకి వెళ్లమంటూ తండ్రి (చౌదరి బల్దేవ్ సింగ్) వారి ప్రేమను అంగీకరిస్తాడు. సేమ్ సీన్ సంబంధించిన ఫోటోను రైల్వే శాఖ క్రియేటివ్‌గా పోస్ట్ చేసింది.
@RailMinIndia అనే ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసిన ఫోటోలో ‘సిమ్రన్ వెళ్లు.. ఏదైనా అవసరం అయితే 139 కి కాల్ చేయమంటూ’ ఆమె తండ్రి చెబుతున్నట్లు క్రియేటివ్ పోస్ట్ పెట్టారు. చాలామంది నెటిజన్లు ఈ పోస్టుపై స్పందించారు. చాలామంది విమర్శించారు. 139 నంబర్‌కు ఎప్పుడు ఫోన్ చేసినా స్పందన లేదని కామెంట్లు పెట్టారు. ఇదంతా కేవలం ప్రచారం కోసమేనంటూ వ్యాఖ్యానించారు. రైల్వే పరిసరాలు, టాయిలెట్లు పరిశుభ్రంగా లేకపోతే ఫిర్యాదు చేసేలా ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్ కూడా ఏర్పాటు చేయాలని మరికొందరు డిమాండ్ చేశారు.
Assistance is One Call Away, Dial Rail Madad Helpline no. 139! pic.twitter.com/sw26eiOxQc
— Ministry of Railways (@RailMinIndia) August 22, 2023