IMD Alert : పలు రాష్ట్రాల్లో అతి భారీవర్షాలు…యూపీలో 19 మంది మృతి

దేశంలోని పలు రాష్ట్రాల్లో మంగళవారం నుంచి సెప్టెంబర్ 14వతేదీ వరకు భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఒడిశా, ఛత్తీస్ ఘడ్, జార్ఖండ్, నాగాలాండ్, మణిపుర్, మిజోరాం, త్రిపుర ప్రాంతాల్లో అతి భారీవర్షాలు కురవవచ్చని ఐఎండీ అధికారులు తెలిపారు....

IMD Alert : పలు రాష్ట్రాల్లో అతి భారీవర్షాలు…యూపీలో 19 మంది మృతి

IMD Rain Alert

IMD Alert : దేశంలోని పలు రాష్ట్రాల్లో మంగళవారం నుంచి సెప్టెంబర్ 14వతేదీ వరకు భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఒడిశా, ఛత్తీస్ ఘడ్, జార్ఖండ్, నాగాలాండ్, మణిపుర్, మిజోరాం, త్రిపుర ప్రాంతాల్లో అతి భారీవర్షాలు కురవవచ్చని ఐఎండీ అధికారులు తెలిపారు. (Rain continues in Uttar Pradesh) ఒడిశాలోని వివిధ ప్రదేశాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భారీవర్షాల వల్ల 19 మంది మరణించారు. (19 dead in 24 hours) ఉత్తరాఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలోని పలు ప్రాంతాల్లో అతి భారీవర్షాలు కురుస్తాయని మంగళవారం ఐఎండీ విడుదల చేసిన వెదర్ బులెటిన్ లో పేర్కొంది. (Uttarakhand, Odisha on alert)

Rain Forecast : బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం.. ఏపీకి భారీ వర్ష సూచన

అండమాన్, నికోబార్ దీవుల్లోని వివిధ ప్రదేశాలలో పిడుగులు, ఈదురు గాలులతో కూడిన భారీవర్షాలు ఎక్కువగా కురిసే అవకాశముంది. ఉత్తర ప్రదేశ్, తూర్పు రాజస్థాన్, మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్‌గఢ్, గంగా పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, తీరప్రాంతాల్లోని వివిక్త ప్రదేశాల్లో మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు.ఆంధ్రప్రదేశ్, యానాం, ఉత్తర కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి. కారైకాల్, కేరళ రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు.

Libya floods : లిబియా వరదల్లో 2వేల మంది మృతి, వేలాదిమంది గల్లంతు

భారీవర్షాల నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌లోని తూర్పు ప్రాంతంలో సెప్టెంబర్ 14 వరకు భారీ వర్షాలు కురుస్తాయని, సెప్టెంబర్ 17 వరకు తేలికపాటి వర్షాలు కురుస్తాయని రిలీఫ్ కమిషనర్ కార్యాలయ అధికారి ఒకరు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని పశ్చిమ ప్రాంతంలో కూడా సెప్టెంబర్ 17 వరకు వర్షాలు, జల్లులు పడే అవకాశం ఉంది. ఇటావా, ఔరైయా, గోండా, కన్నౌజ్, అయోధ్య, బస్తీ సహా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

COVID-19 Pirola Variant : ఢిల్లీలో ప్రబలుతున్న కొవిడ్ పిరోలా వేరియంట్

లక్నో, లఖింపూర్ ఖేరీలలో పిడుగులు పడే అవకాశం ఉన్నందున, పాఠశాలలను మూసివేయాలని, ప్రజలు బయటకు రావద్దని అధికారులు కోరారు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్, చంపావత్, నైనిటాల్, ఉధమ్ సింగ్ నగర్ జిల్లాల్లో సెప్టెంబర్ 13 వతేదీన భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. తెహ్రీ, బాగేశ్వర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో నిరంతర వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో ఇళ్లు కూలిపోయాయి. వర్షం హెచ్చరికల మధ్య చంపావత్, ఉధమ్ సింగ్ నగర్‌లోని పాఠశాలలను మూసివేశారు.

Nipah virus : కేరళలో నిపా వైరస్ మహమ్మారి…ఇద్దరి మృతి

రాబోయే కొద్ది రోజుల్లో రాజస్థాన్‌లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కార్యాలయం తెలిపింది. గత 24 గంటల్లో ధోల్‌పూర్, బన్స్వారా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదైంది. ధోల్‌పూర్‌లో అత్యధికంగా 23 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. భరత్‌పూర్, జైపూర్, కోట, ఉదయ్‌పూర్ మరియు అజ్మీర్ డివిజన్‌లలోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షం నమోదైంది. ఒడిశా, జార్ఖండ్ మరియు పశ్చిమ బెంగాల్‌లో రాబోయే రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులు , అప్పుడప్పుడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Kim Jong Un : పుతిన్‌ను కలిసేందుకు రష్యాకు రైలులో బయలుదేరిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్

తూర్పు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కోస్తా ఆంధ్ర ప్రదేశ్, కేరళ, తెలంగాణలలో కూడా రాబోయే రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అస్సాం, మేఘాలయలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలలో సెప్టెంబర్ 11నుంచి 15వతేదీల మధ్య భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కార్యాలయం తెలిపింది.