Rajasthan Assembly Election 2023: రాజస్థాన్‌లో ముగిసిన పోలింగ్.. ప్రశాంతంగా జరిగిందన్న ఈసీ
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రంలోని 200 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 199 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది.

Rajasthan Assembly Election 2023
Rajasthan Election 2023 : రాజస్థాన్‌లో గెలుపు పై కాంగ్రెస్, బీజేపీ ధీమాగా ఉన్నాయి. వరుసగా రెండోసారి అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ చెబుతుండగా.. ఈసారి తమదే అధికారమని బీజేపీ అంటోంది.
LIVE NEWS & UPDATES
-
రాజస్థాన్‌లో పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 6 గంటలకు ముగిసింది. అయితే 6 గంటల లోపు పోలింగ్ కేంద్రానికి చేరుకుని లైనులో ఉన్నవారికి మాత్రం ఓటు వేసేందుకు అనుమతి ఇస్తున్నారు.
-
రాజస్థాన్ ఎన్నికల పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు
రాజస్థాన్ లో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. సాయంత్రం 5 గంటల వరకు 68.24 శాతం పోలింగ్ నమోదైంది. రాజస్థాన్‌లోని 200 అసెంబ్లీ స్థానాల్లో 199 స్థానాల్లో ఓటింగ్ కొనసాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ నేతలు తమదే విజయమని చెప్పుకుంటున్నారు.
రాజస్థాన్ లో ప్రాంతాల వారీగా ఓటింగ్ వివరాలు
అజ్మీర్‌లో 65.75 శాతం
అల్వార్‌లో 69.71 శాతం
ఉదయ్‌పూర్‌లో 64.98 శాతం
పోకరన్‌లో 81.12 శాతం
హనుమాన్‌గఢ్‌లో 75.75 శాతం
ధోల్‌పూర్‌లో 74.11 శాతం
ఝల్వార్‌లో 73.37 శాతం
జైసల్మేర్‌లో 76.57 శాతం
శివ్ లో 75.57 శాతం
సర్దార్ నగరంలో 71.74 శాతం
సర్దార్‌పురాలో 61.30 శాతం ఓటింగ్ జరిగింది.
-
కాల్పులు జరుపుకున్న బీజేపీ, బీఎస్పీ నేతలు
రాజస్థాన్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. కాగా ధోల్‌పూర్‌లోని బారీ అసెంబ్లీ నియోజకవర్గంలోని రజాయ్, అబ్దుల్‌పూర్ గ్రామాల్లో నకిలీ ఓటింగ్‌పై రెండు పార్టీల మధ్య ఘర్షణ జరిగింది. రాజై గ్రామంలో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకోవడంతో పోలింగ్ కేంద్రం వద్ద భయాందోళన నెలకొంది.
-
రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌కు ఉత్సాహం: గోవింద్ సింగ్
రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ దోటసార మాట్లాడుతూ, "రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పట్ల సానుకూల వాతావరణం ఉంది. ప్రజలు సంతోషంగా ఓటు వేస్తున్నారు. కాంగ్రెస్ చేసిన పని, పార్టీ ఇచ్చిన హామీల కారణంగా భారీ ఉత్సాహం కనిపిస్తోంది. కారణం కోవిడ్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిర్వహణకు ప్రజలు ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మంచి మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వస్తుంది’’
-
రాజస్థాన్ ఎన్నికల పోలింగ్ ఎలా జరుగుతోంది?
మధ్యాహ్నం 1 గంట వరకు రాజస్థాన్‌లోని బరాన్‌లో అత్యధిక ఓటింగ్ జరిగింది. ఇక్కడ 45.75 శాతం మంది ఓటు వేశారు. రాజస్థాన్ లో ప్రాంతాల వారీగా ఓటింగ్ వివరాలు.
అజ్మీర్ - 37.86%
భిల్వారా - 39.74%
అజ్మీర్ - 37.86%
భిల్వారా - 39.74%
బికనీర్ - 39.39%
జైపూర్ - 40.32%
జుంజును - 40.19%
కోటా - 42.55%
ఉదయపూర్ - 37.60%
చురు - 40.66%
-
రాజస్థాన్ లో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. మధ్యాహ్నం 1గంట వరకు 40.27శాతం పోలింగ్ నమోదైంది.
-
ప్రశాంతంగా ఓటింగ్ ..
రాజస్థాన్ లో 199 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరుగుతోంది. చాలా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటువేసేందుకు ఓటర్లు బారులుతీరారు. ఉదయం 11గంటల వరకు 24.74శాతం ఓటింగ్ జరిగింది.
-
ఓటు వేసిన గెహ్లాట్ ..
రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సర్దార్ పురాలో ఓటు హక్కు వినియోగించుకున్నాడు. అనంతరం గెహ్లాట్ మాట్లాడుతూ.. మళ్లీ రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని ధీమా వ్యక్తం చేశారు.
#WATCH जोधपुर (राजस्थान): राजस्थान के मुख्यमंत्री अशोक गहलोत ने अपना वोट डाला। वीडियो बूथ संख्या 108 - 111, सरदारपुरा से है। pic.twitter.com/U5GEXadVUu
— ANI_HindiNews (@AHindinews) November 25, 2023
-
కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ తూర్పు బికనేర్ లో ఓటువేశారు.
బీజేపీ ఎంపీ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ జైపూర్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
బీజేపీ ఎంపీ, విద్యాధర్ నగర్ అభ్యర్థి దియా కుమారి జైపూర్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
-
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం 9గంటల వరకు 9.77 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా బరన్ జిల్లాలో 12.97 శాతం ఓటింగ్ నమోదైంది. దుంగార్‌పూర్‌లో అత్యల్ప ఓటింగ్ జరిగింది. ఇక్కడ ఉదయం 9 గంటల వరకు 6.76 శాతం మాత్రమే ఓటింగ్ జరిగింది.
-
భార్యతో బైక్ పై పోలింగ్ బూత్ కు ..
బీజేపీ ఎంపీ సుభాష్ చంద్ర బహేరియా, ఆయన భార్య రంజనా బహేరియా ద్విచక్ర వాహనంపై భిల్వారాలోని పోలింగ్ బూత్‌కు వచ్చి ఓటు వేశారు.
#WATCH | Rajasthan Elections | BJP MP Subhash Chandra Baheria and his wife Ranjana Baheria arrived at a polling booth in Bhilwara on a two-wheeler to cast their votes. pic.twitter.com/9Qj793x6vl
— ANI (@ANI) November 25, 2023
-
ఓటు వేసిన కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్..
కేంద్ర మంత్రి, బీజేపీ నేత గజేంద్ర సింగ్ షెకావత్ కుటుంబ సమేతంగా బోధ్ పూర్ లో ఓటు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీజేపీ భారీ మెజార్టీతో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
-
ఓటు వేసిన తరువాత స్థానిక మీడియాతో వసుందర రాజే మాట్లాడారు.. ఓటర్లందరూ, ముఖ్యంగా కొత్త ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేయాలని, దేశానికి పెద్దపీట వేయాలని కోరుతున్నానని అన్నారు.
-
రాజస్థాన్ మాజీ సీఎం, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు వసుందర రాజే ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఝలావర్ జిల్లా నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆమె ఓటు వేశారు. అంతకుముందు హనుమాన్ ఆలయానికి వెళ్లి పూజలు చేశారు.
-
సీఎం అభ్యర్థిపై కాంగ్రెస్ నేతలు ఏమన్నారంటే..
కాంగ్రెస్‌కు మెజారిటీవస్తే ముఖ్యమంత్రి అవుతారని స్థానిక మీడియా అశోక్ గెహ్లాట్ ను ప్రశ్నించగా.. పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఇదే అంశంపై సచిన్ పైలట్ మాట్లాడుతూ.. మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, నమ్మకంగా ఉన్నామని చెప్పారు. అయితే, కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరనేది ఎన్నికల తరువాత హైకమాండ్ నిర్ణయిస్తుందని పైలెట్ చెప్పాడు.
-
ఐదేళ్లలో అధికారాన్ని మార్చే సంప్రదాయం ఈసారి పనిచేయదు: అశోక్ గెహ్లాట్
మా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు, 5 ఏళ్లలో చేసిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని మళ్లీ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అధికారాన్ని మార్చుకునే సంప్రదాయం ఈసారి పనిచేయదని రాజస్థాన్ సీఎం, కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ అన్నారు.
-
రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే ఓటు వేయడానికి ముందు హనుమాన్ ఆలయానికి చేరుకున్నారు. ఝల్రాపటన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ నాయకురాలు వసుంధర రాజే ఝలావర్‌లోని ఓ ఆలయంలో ప్రార్థనలు చేశారు.
-
ఒకే కుటుంబంకోసం పోలింగ్ బూత్ ..
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఒకే కుటుంబం కోసం అధికారులు పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. పాకిస్థాన్ సరిహద్దులో ఉన్న బార్మర్ జిల్లా పార్ గ్రామంలో రాష్ట్రంలోనే అతిచిన్న పోలింగ్ కేంద్రం ఉంది. ఇక్కడ మూడు వేరువేరు ఇళ్లలో నివసించే ఒకే కుటుంబానికి చెందిన 35 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 17 మంది మహిళలు, 18 మంది పురుషులు ఉన్నారు. వీరికోసం ఎన్నికల కమిషన్ అధికారులు గ్రామంలో ప్రత్యేక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
-
ప్రధాని మోదీ ట్వీట్ ..
రాజస్థాన్ యువత తప్పనిసరిగా ఓటు వేయండి. గరిష్ట సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా ఓటింగ్‌లో కొత్త రికార్డు సృష్టించాలని నేను అభ్యర్థిస్తున్నాను. ఈ సందర్భంగా తొలిసారిగా ఓటు వేయబోతున్న రాష్ట్ర యువ మిత్రులందరికీ నా శుభాకాంక్షలు అని ప్రధాని ట్వీట్ చేశారు.
-
#WATCH | Rajasthan Elections | Voters queue up at a polling station in Kota South Assembly constituency; voting for the state assembly election began at 7 am. pic.twitter.com/1aCi4iBnx5
— ANI (@ANI) November 25, 2023
-
రాజస్థాన్‌లో గెలుపుపై కాంగ్రెస్, బీజేపీ ధీమాగా ఉన్నాయి. వరుసగా రెండోసారి అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ చెబుతుండగా... ఈసారి తమదే పవర్ అంటోంది బీజేపీ. అయితే, రాజస్థాన్‌లో వరుసగా రెండోసారి ఏ పార్టీ కూడా అధికారం చేపట్టలేదు. ఈ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్‌తోపాటు బీజేపీ హోరాహోరీగా తలపడుతున్నాయి.
-
ఎన్నికల్లో బరిలో 1869 మంది అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. రాష్ట్ర 199 నియోజకవర్గాల్లో కేంద్ర ఎన్నికల సంఘం 51,507 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఎన్నికల విధుల్లో 2 లక్షల 74వేల 846 మంది ఉన్నారు. 5 కోట్ల 25 లక్షల 38వేల 105 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
-
రాజస్థాన్‌లో మొత్తం 200 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇవాళ 199 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. కరన్‌పూర్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్‌సింగ్ మృతితో అక్కడ ఎన్నికలు వాయిదా పడ్డాయి.
-
రాజస్థాన్ లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. పోలింగ్ కేంద్రాల దగ్గర అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మక కేంద్రాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది.