Rajasthan Polls: కాంగ్రెస్ ఓడి బీజేపీ అధికారంలోకి వస్తుందా? రాజస్థాన్‭లో తీర్పు ఇచ్చేది రేపే

బీజేపీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది. అయితే అధికార కాంగ్రెస్ 2018 ఎన్నికల మాదిరిగానే దాని మిత్రపక్షమైన రాష్ట్రీయ లోక్ దళ్ (RLD) కోసం భరత్‌పూర్ స్థానాన్ని వదిలివేసింది.

Rajasthan Polls: కాంగ్రెస్ ఓడి బీజేపీ అధికారంలోకి వస్తుందా? రాజస్థాన్‭లో తీర్పు ఇచ్చేది రేపే

Updated On : November 24, 2023 / 7:38 PM IST

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‫‭కు సమయం ఆసన్నమైంది. రాష్ట్రంలోని 199 అసెంబ్లీ నియోజకవర్గాలకు శనివారం పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కాగా, రాజస్థాన్ లో ఈసారి పరిస్థితి ఎలా ఉండబోతోంది? సంప్రదాయం ప్రకారం ప్రజలు ఆలోచిస్తే ఈసారి ప్రభుత్వం మారిపోతుంది. కానీ అలా జరగకుంటే ఏం జరుగుతుంది? మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందా? లేదంటే హంగ్ ఏర్పడుతుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

5.25 ఓటర్లు
రాష్ట్రంలో మొత్తం 5,25,38,105 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే ఇందులో 1,70,99,334 మంది 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్కులే ఉండడం విశేషం. కాగా ఈ ఎన్నికల్లో 22,61,008 కొత్తగా ఓటు వేయబోతున్నారు. వీళ్లంతా 18-19 సంవత్సరాల వయసు వారు. శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందని రాజస్థాన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రవీణ్ గుప్తా తెలిపారు.

ఇది కూడా చదవండి: తెలంగాణ ఏర్పాటు, ఉచిత్ కరెంటు గురించి పెద్ద ప్రకటనే చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత

199 స్థానాలకు పోలింగ్‌
రాజస్థాన్‌లో ప్రధాన పోటీ అధికార కాంగ్రెస్ మరియు ప్రధాన ప్రతిపక్ష పార్టీ భారతీయ జనతా పార్టీ మధ్య ఉంటుందని భావిస్తున్నారు. ఈ రెండు పార్టీల నాయకుల దూకుడు మీద సాగిన ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రం ఆగిపోయింది. అనంతరం అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను ప్రలోభపెట్టేందుకు యత్నాలు చేస్తున్నారు. రాజస్థాన్‌లో మొత్తం 200 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే గుర్మీత్ సింగ్ కున్నార్ మరణంతో కరణ్‌పూర్ స్థానానికి ఎన్నిక వాయిదా పడింది.

ఈ పార్టీలు పోటీలో ఉన్నాయి
బీజేపీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది. అయితే అధికార కాంగ్రెస్ 2018 ఎన్నికల మాదిరిగానే దాని మిత్రపక్షమైన రాష్ట్రీయ లోక్ దళ్ (RLD) కోసం భరత్‌పూర్ స్థానాన్ని వదిలివేసింది. ప్రస్తుత RLD ఎమ్మెల్యే సుభాష్ గార్గ్ భరత్‌పూర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఇది కాకుండా బహుజన్ సమాజ్ పార్టీ, సీపీఐ(ఎం), రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ, భారత్ ఆదివాసీ పార్టీ, భారతీయ గిరిజన పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, ఏఐఎంఐఎం సహా పలు పార్టీలు ఎన్నికల బరిలో ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి 40 మందికి పైగా రెబల్స్ కూడా పోటీలో ఉన్నారు.

ఇది కూడా చదవండి: ఏడేళ్ల తర్వాత మొదటిసారి తండ్రిని కలిసిన ఎలన్ మస్క్.. ఫ్యామిలీ ఫుల్ ఎమోషనల్!

ప్రస్తుత అసెంబ్లీ గురించి మాట్లాడుకుంటే, ప్రస్తుతం కాంగ్రెస్‌కు 107 మంది, బీజేపీకి 70 మంది, ఆర్‌ఎల్‌పీకి ముగ్గురు, సీపీఐ(ఎం)కి 2, భారతీయ ట్రైబల్ పార్టీ (బీటీపీ), రాష్ట్రీయ లోక్‌దళ్‌కు ఒక ఎమ్మెల్యే ఉన్నారు. 13 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉండగా రెండు స్థానాలు (ఉదయ్‌పూర్, కరణ్‌పూర్) ఖాళీగా ఉన్నాయి.

ఏర్పాట్లు పూర్తి
నిష్పక్షపాతంగా, నిరాటంకంగా, స్వేచ్ఛగా ఓటింగ్‌ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని 36,101 చోట్ల మొత్తం 51,507 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ప్రధాన ఎన్నికల అధికారి ప్రవీణ్‌ గుప్తా తెలిపారు. వీటిలో పట్టణ ప్రాంతాల్లో 10,501, గ్రామీణ ప్రాంతాల్లో 41,006 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 26,393 పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్‌కాస్టింగ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ పోలింగ్ కేంద్రాలను జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 65,277 బ్యాలెట్ యూనిట్లు, 62,372 కంట్రోల్ యూనిట్లు, రిజర్వ్‌లతో సహా 67,580 వీవీప్యాట్ యంత్రాలను ఓటింగ్ కోసం వినియోగించనున్నారు.

ఇది కూడా చదవండి: ఆఫ్గన్ బార్డర్‭లోనే ఆగిపోయిన వందలాది పాకిస్థాన్ ట్రక్కులు.. ఇది మన దేశానికి ఎందుకు గుడ్ న్యూస్?

అసెంబ్లీ ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు 6,287 మంది మైక్రో అబ్జర్వర్లు, 6247 మంది సెక్టార్ అధికారులను రిజర్వ్‌లో నియమించినట్లు తెలిపారు. అదేవిధంగా 2,74,846 మంది పోలింగ్ సిబ్బంది ఓటింగ్ నిర్వహించనున్నారు. 7960 మంది మహిళా పోలింగ్ సిబ్బంది మహిళా నిర్వహించే పోలింగ్ స్టేషన్‌లలో కమాండ్‌గా వ్యవహరిస్తారు. 796 మంది వికలాంగ పోలింగ్ సిబ్బంది వికలాంగులు నిర్వహించే పోలింగ్ స్టేషన్‌లలో కమాండ్‌గా వ్యవహరిస్తారు.

ఒక పోలీసు అధికారి ప్రకారం.. 1,70,000 మందికి పైగా భద్రతా సిబ్బంది ఓటింగ్ ప్రక్రియను సజావుగా, శాంతియుతంగా ఉండేందుకు మోహరించారు. ఇందులో 70 వేల మందికి పైగా రాజస్థాన్ పోలీసులు, 18 వేల మంది రాజస్థాన్ హోంగార్డ్‌లు, 2 వేల మంది రాజస్థాన్ బోర్డర్ హోంగార్డ్‌లు, పోలీసు సిబ్బంది ఉన్నారు. ఇతర రాష్ట్రాలు (ఉత్తరప్రదేశ్, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్), RAC కి చెందిన 120 కంపెనీలను పిలిపించారు.