రాజస్థాన్ యాక్సిడెంట్ : గాయపడినవారిని తన కారులో తీసుకెళ్లి..హాస్పిటల్లో చేర్చిన కేంద్రమంత్రి

  • Published By: nagamani ,Published On : June 30, 2020 / 12:49 PM IST
రాజస్థాన్ యాక్సిడెంట్ : గాయపడినవారిని తన కారులో తీసుకెళ్లి..హాస్పిటల్లో చేర్చిన కేంద్రమంత్రి

Updated On : June 30, 2020 / 1:20 PM IST

కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ గజేంద్రసింగ్ షెఖావత్ మానవత్వాన్ని చాటుకున్నారు. యాక్సిడెంట్ లో గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని తన కాన్వాయ్ లో హాస్పిటల్ కు తరలించారు. దీంతో ఆయన పెద్ద మనస్సుని అందరూ ప్రశంసిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే..రాజస్థాన్‌లోని షేర్‌గఢ్ ప్రాంతంలో బైకు అదుపుతప్పి ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలపాలయ్యారు. సంఘటనా స్థలంలో రెండు బైకులు, ఇద్దరు వ్యక్తులు చెల్లాచెదురుగా పడిఉన్నారు. వారిని హాస్పిటల్ తీసుకెళ్లే నాధుడే లేకపోయాడు. ఇంతలో అప్పుడే కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ గజేంద్రసింగ్ షెఖావత్ జోధ్‌పూర్ నియోజకవర్గం పర్యటనకు సోమవారం (జూన్ 29,2020) రహదారి గుండా కాన్వాయ్‌లో వెళ్తున్నారు.

వెళ్తూ రోడ్డు పక్కనే గాయాలతో పడిఉన్న ఇద్దరు వ్యక్తులను చూసి ఆయన చలించిపోయారు. వెంటనే సహాయక చర్యలు చేయాలని ఆదేశించారు. అంతేకాదు వారిని దగ్గరుండి తన వాహనంలో ఆసుపత్రికి తరలించి.. వారి ప్రాణాలు కాపాడారు. అంతటితో నా పని అయిపోయిందని ఊరుకోలేదు. హాస్పిటల్ కు ఫోన్ చేసి గాయాలైన వ్యక్తులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు ఆదేశాలు జారీచేశారు.ప్రమాదంలో ఉన్నవారిని ఆసుపత్రికి తరలించి వారి ప్రాణాలు కాపాడిన మంత్రి గజేంద్రసింగ్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. నిజమైన జననేత అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read:భార్య బొట్టు, గాజులు వద్దనుకుంటే ఆ పెళ్లిని తిరస్కరించినట్లే, హైకోర్టు సంచలన తీర్పు, ఆమె భర్తకు విడాకులు మంజూరు