రజనీకాంత్ సంచలనం : నా సపోర్ట్ నీకే కమల్

  • Published By: veegamteam ,Published On : April 3, 2019 / 07:05 AM IST
రజనీకాంత్ సంచలనం : నా సపోర్ట్ నీకే కమల్

Updated On : April 3, 2019 / 7:05 AM IST

తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు ఆసక్తికరంగాను..సంచలనంగా ఉంటాయి. ఈ క్రమంలో తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్. అదే కమలహాసన్ పార్టీకి రజనీకాంత్ మద్దతు ప్రకటించటం. ఈ విషయాన్ని కమలహాసన్ స్వయంగా వెల్లడించారు.

గతంలో తన పార్టీ కేంద్ర కార్యాలయంలో భేటీ సందర్భంగా రజనీకాంత్ మద్దతు కోరానని.. అందుకు రజనీ ఒకే చెప్పినట్లు కమలహాసన్ తెలిపారు. ఈ సందర్భంగా  ఎన్నికల్లో తమ పార్టీ (మక్కళ్‌ నీధి మయ్యమ్‌)విజయం సాధించాలని రజనీ ఆకాంక్షించారని.. కమల్ హాసన్ స్వయంగా ప్రకటించుకున్నారు. బీజేపీకి తమ పార్టీ బీ-టీమ్ కాదని కమల్ స్పష్టం చేశారు. 39 లోక్ సభ స్థానాలతో పాటు.. ఉపఎన్నికలు జరుగుతున్న 18 అసెంబ్లీ స్థానాల్లో కమల్ పార్టీ మక్కల్ నీధి మయ్యమ్ పోటీ చేస్తోంది. కమల్ మాత్రం పోటీకి దూరంగా ఉన్నారు.

రజనీకాంత్ రాజకీయాల్లో వస్తారనే ప్రచారం సాగిన తరుణంలో అభిమాన సంఘాలతో వరుసగా సమావేశాలు నిర్వహించడం పార్టీ పేరు ఖరారు అయిపోయిందనే క్రమంలో ఒకసారిగా రజనీకాంత్ స్థబ్దుగా ఉండిపోయారు. పార్టీ ప్రకటన విషయంలో కూడా అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. రజనీ మాత్రం రాజకీయ పార్టీ పెట్టే విషయంపై ఇప్పటికీ క్లారిటీ లేకుండా పోయింది. ఈ క్రమంలో సడెన్ గా కమల్ హాసన్ కు రజనీకాంత్ మద్దతునిస్తారనే వార్త నిజంగా తమిళరాజకీయాల్లో సంచనలమనే చెప్పాలి.