IAF : 20 ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
దేశంలో 20 ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫీల్డ్స్ ను జాతీయ హైవే నిర్మించడం జరుగుతోందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు.

Rajnath
Rajnath Singh : దేశంలో 20 ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫీల్డ్స్ ను జాతీయ హైవేలపై నిర్మించడం జరుగుతోందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. ఈ ఎమర్జెన్సీ ఫీల్డ్స్ ను ప్రకృత్తి విపత్తు సమయంలో..రెస్క్యూ ఆపరేషన్ కోసం వాడనున్నట్లు తెలిపారు. దేశ ఐక్యత సమగ్రతను కాపాడుకొనేందుకు ఇదో మార్గమని వెల్లడిస్తూనే…ఎలాంటి సవాళ్లను అయినా ఎదుర్కొనే సామర్థ్యం భారతదేశం కలిగి ఉందని మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు.
Read More : Afghanistan-China : అప్ఘాన్‌కు చైనా భారీ సాయం
2021, సెప్టెంబర్ 09వ తేదీ గురువారం…రాజస్థాన్ రాష్ట్రానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాత్ సింగ్ విచ్చేశారు. జాలోర్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫీల్డ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు..రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కే ఎస్ బదౌరియా, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ లు పాల్గొన్నారు.
Read More : IRCTC : సెప్టెంబర్ 18న ప్రారంభం కానున్న క్రూజ్ లైనర్
ఈ సందర్భంగా రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ మాట్లాడుతూ…హైవేలపై అనేక చోట్ల హెలిప్యాడ్ లను నిర్మించడం జరుగుతోందని, ఆర్మీ సామర్థ్యం పెంచేందుకు నేషనల్ హైవే అథార్టీ ఆఫ్ ఇండియా దేశంలోని..అనేక ప్రాంతాల్లో వీటిని డెవలప్ చేస్తున్నట్లు తెలిపారు. జాలార్ లో ఉన్న ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫీల్డింగ్ వద్ద మూడు హెలిప్యాడ్లను కూడా నిర్మించడం జరిగిందన్నారు.
Read More : Afghanistan : అప్ఘానిస్తాన్‌లో తాలిబన్ల దాష్టీకం..నిరసన ప్రదర్శనలు కవర్ చేసిన జర్నలిస్టులపై దాడి
అంతకుముందు…సుఖోయ్ ఎస్ యూ – 30 ఎంకేఐ ఫైటర్ విమానాన్ని…జాతీయ హైవేపై ల్యాండ్ చేశారు. ఒక యుద్ధ విమానం..హైవేపై ల్యాండ్ కావడం ఇదే తొలిసారి. వైమానిక దళానికి చెందిన సీ – 130 జే సూపర్ హెర్య్కులస్ రవాణా విమానాన్ని కూడా ల్యాండ్ చేశారు. ఈ విమానంలో మంత్రి రాజ్ నాథ్, గడ్కరి, ఎయిర్ చీఫ్ లు ప్రయాణించారు.