Rakesh Jhunjhunwala : మొన్న రూ. 854 కోట్లు, నేడు రూ. 375 కోట్లు

మార్కెట్ ర్యాలీలో నాలుగు రోజుల్లో రూ. 375 కోట్లు సంపాదించారు ఝున్ ఝున్ వాలా. కరోనా కాలంలోనే టాటా మోటార్స్ షేర్లపై ఝున్ ఝున్ వాలా దృష్టి సారించారు.

Rakesh Jhunjhunwala : మొన్న రూ. 854 కోట్లు, నేడు రూ. 375 కోట్లు

Stock Market

Updated On : October 12, 2021 / 2:38 PM IST

Rakesh Jhunjhunwala Rs 375 crore : లక్కంటే అతనిదే అంటున్నారు అందరూ. స్టాక్ మార్కెట్ లో ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కిన ఝున్ ఝున్ వాలా మరోసారి లాభపడ్డారు. మొన్న రూ. 854 కోట్లు లాభపడితే..ఇప్పుడు కేవలం నాలుగు సెషన్ల వ్యవధిలో రూ. 375 కోట్లు సంపాదించారు. ఆయన పెట్టుబడులు పెట్టిన టాటా మోటార్స్, టైటాన్ కంపెనీ, నజారా టెక్నాలజీస్ స్టాకులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో ఆయన సంపాదన మరింత పెరిగింది. పండుగ సీజన్ కావడం, ఈవీ కార్ల రంగంలోకి ప్రయత్నాలు మొదలైన తరుణంలో…టాటా షేర్లు విపరీతంగా పెరగడానికి కారణమయ్యాయని మోర్గాన్ స్టాన్లే వెల్లడిస్తోంది. మార్కెట్ ర్యాలీలో నాలుగు రోజుల్లో రూ. 375 కోట్లు సంపాదించారు ఝున్ ఝున్ వాలా.

Read More :Rakesh Jhunjhunwala: ఎయిర్ లైన్స్ బిజినెస్‌లోకి ఝున్ ఝున్ వాలా.. రూట్ క్లియర్ చేసిన కేంద్రం 

స్టాక్ మార్కెట్ లో జరుగుతున్న పరిణామాలను ఆయన నిశితంగా గమనిస్తూ ఉంటారు. వ్యూహాలు అనుసరిస్తూ కంపెనీల యొక్క షేరు విలువను అమాంతం పైకి తీసుకెళ్లగలరు. కంపెనీ యొక్క షేరు విలువ అమాంతం పెరగడంతో కొన్ని గంటల వ్యవధిలో వాటాల విలువ రూ. 854 కోట్లు పెరిగింది. ఇలా కొన్ని స్టాక్స్ ను ఏళ్లుగా తన ఖాతాలో కొనసాగిస్తూ..లాభాలు ఆర్జిస్తున్నారు. మోర్గాన్ స్టాన్లే వెల్లడించిన వివరాల ప్రకారం…రూ. 298గా ఉన్న టాటా షేర్ల ధరలు రూ. 448కి చేరుకున్నాయి. దీంతో ఆయన ఆదాయం వందల కోట్లను దాటేసింది. కేవలం మూడు సెషన్ లలో రూ. 310 కోట్లు సంపాదించారు.

Read More : India’s Big Bull : స్టాక్స్ అమ్మే విషయంలో ఝున్‌‌ఝున్‌‌వాలా ఏం చేస్తారు ?

కరోనా కాలంలోనే టాటా మోటార్స్ షేర్లపై ఝున్ ఝున్ వాలా దృష్టి సారించారు. సుమారు 4 కోట్ల షేర్లను 2020, సెప్టెంబర్ లో కొనుగోలు చేశారు. 2021, జూన్ చివరి నాటికి టాటా మోటార్స్ లో 1.14 శాతం వాటాను (వేయి 643 కోట్లు), 3 కోట్ల 77 లక్షల ఈక్విటీ షేర్లను కలిగి ఉన్నారు.