Rare Incident: 23 వారాలకు అమ్మ గర్భంలో ఓ శిశువు మృతి.. 52 వారాల తర్వాత ఆరోగ్యంగా పుట్టిన మరో శిశువు
ఒడిశాలో తాజాగా చాలా అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ గర్భంలో కవలలు ఉండగా, వారిలో ఓ శిశువు తల్లి కడుపులోనే 23 వారాల తర్వాత మృతి చెందింది. అయితే, రెండో బిడ్డ మాత్రం పూర్తి ఆరోగ్యంతో 52 వారాల తర్వాత జన్మించింది. ఈ విషయంపై వైద్యులు మీడియాకు నిన్న వివరాలు తెలిపారు. ఒడిశాలోని కటక్ జిల్లాకు చెందిన 31 ఏళ్ల పార్వతీ బెహారా తాజాగా ఓ బిడ్డకు జన్మనిచ్చిందని చెప్పారు.

One In Every 36 Infants Still Dies Before First Birthday In India Data
Rare Incident: ఒడిశాలో తాజాగా చాలా అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ గర్భంలో కవలలు ఉండగా, వారిలో ఓ శిశువు తల్లి కడుపులోనే 23 వారాల తర్వాత మృతి చెందింది. అయితే, రెండో బిడ్డ మాత్రం పూర్తి ఆరోగ్యంతో 52 వారాల తర్వాత జన్మించింది. ఈ విషయంపై వైద్యులు మీడియాకు నిన్న వివరాలు తెలిపారు. ఒడిశాలోని కటక్ జిల్లాకు చెందిన 31 ఏళ్ల పార్వతీ బెహారా తాజాగా ఓ బిడ్డకు జన్మనిచ్చిందని చెప్పారు.
కెండుపాటీ గ్రామానికి చెందిన ఆ మహిళ 52 వారాల క్రితం ఐవీఎఫ్ విధానంలో గర్భం దాల్చిందని వైద్యులు వివరించారు. ఆమె కడుపులో కవల శిశువులు పెరిగారని తెలిపారు. దురదృష్టవశాత్తూ 23 వారాల అనంతరం ఆ కవలల్లో ఓ శిశువు తల్లి గర్భంలోనే చనిపోయిందని చెప్పారు.
ఆ సమయంలో ఆ మహిళ కడుపునొప్పితో బాధపడుతూ ఆసుపత్రికి వచ్చిందని, దీంతో తాము పరీక్ష చేసి చూడగా ఓ శిశువు మరణించినట్లు గుర్తించామని తెలిపారు. దీంతో ఆమె గర్భంలో నుంచి ఓ శిశువును తొలగించామని చెప్పారు. అయినప్పటికీ, రెండో పిండానికి మాత్రం ఏమీ జరలేదని అన్నారు. రెండో శిశువు 52 వారాల తర్వాత జన్మించాడని చెప్పారు.
ఇటువంటి ఘటనలు చోటుచేసుకోవడం చాలా అరుదని వివరించారు. 100 కోట్ల మంది మహిళల్లో ఇద్దరికి మాత్రమే ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. మాతృత్వం కోసం ఎదురుచూస్తున్న ఆ మహిళ చివరకు కుమారుడికి జన్మనివ్వడంతో అంబరాన్నంటే సంతోషాన్ని వ్యక్తం చేసింది.
Woman kills infant son: 4 నెలల కుమారుడిని అతి దారుణంగా చంపిన తల్లి.. మూఢ నమ్మకమే కారణం