Chennai: 22 కిలోల గంజాయిని ఎలుకలు తినేశాయని కోర్టుకు చెప్పిన పోలీసులు
కోర్టుకు కేవలం 50 గ్రాముల గంజాయిని మాత్రమే పోలీసులు చూపించారు.

Rats
Chennai – Police : పోలీస్ స్టేషన్ స్టోర్ హౌస్‌లో నిల్వ ఉంచిన 22 కిలోల గంజాయిని ఎలుకలు తినేశాయని న్యాయస్థానానికి పోలీసులు చెప్పారు. ఈ విచిత్ర ఘటన తమిళనాడు(Tamil Nadu)లో చోటుచేసుకుంది. గంజాయి రవాణా చేస్తున్న రాజగోపాల్, నాగేశ్వర రావును చెన్నైలోని మరియానా పోలీసులు అరెస్టు చేశారు.
వారి నుంచి 23 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ కోర్టులో పోలీసులు ఛార్జిషీట్ కూడా దాఖలు చేశారు. తాజాగా, కోర్టులో వాదనలు జరిగాయి. కోర్టుకు కేవలం 50 గ్రాముల గంజాయిని మాత్రమే పోలీసులు చూపించారు.
మరో 50 గ్రాముల గంజాయిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు ఇచ్చామని పోలీసులు తెలిపారు. దీంతో మిగతా గంజాయి ఎక్కడని కోర్టు అడిగింది. అదంతా ఎలుకలు తినేశాయని పోలీసులు చెప్పారు. పోలీసులు గంజాయిని చూపించకపోవడంతో రాజగోపాల్, నాగేశ్వర రావును కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. పోలీస్ స్టేషన్ స్టోర్ హౌస్‌లో నిల్వ ఉంచిన మద్యం బాటిళ్లను ఎలుకలు తాగేశాయని, గంజాయిని తినేశాయని గతంలోనూ అనేకసార్లు కోర్టులకు పోలీసులు చెప్పిన ఘటనలు ఉన్నాయి.
Pinocchio Effect : మీరు అబద్ధం చెబితే మీ ముక్కు చెప్పేస్తుంది