Realme 8 Pro.. అదిరిపోయే కెమెరా ఫీచర్లు, సరసమైన ధరలు, ఇదే తొలిసారి

Realme 8 Pro.. అదిరిపోయే కెమెరా ఫీచర్లు, సరసమైన ధరలు, ఇదే తొలిసారి

Realme 8 Pro Smartphone With Super Features

Updated On : March 26, 2021 / 2:34 PM IST

Realme 8 Pro Smart Phone : సూపర్ ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్‌మీ.. అదిరిపోయే కెమెరా ఫీచర్ తో స్మార్ట్ ఫోన్ ని తీసుకొచ్చింది. తొలిసారిగా 108 మెగాపిక్సెల్‌ అల్ట్రా క్వాడ్‌ కెమెరాతో స్మార్ట్‌ఫోన్‌ ఆవిష్కరించింది. రియల్‌మీ8 ప్రో పేరుతో దీన్ని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. క్వాడ్‌ కెమెరాతోపాటు ప్రపంచంలో తొలిసారిగా స్టారీ టైమ్‌ ల్యాప్స్‌ వీడియో, టిల్ట్‌ షిఫ్ట్‌ టైమ్‌ ల్యాప్స్‌ వీడియో ఫీచర్లను జోడించినట్టు కంపెనీ తెలిపింది.

Realme8 Pro ఫీచర్లు
* 6.40 ఇంచెస్ సూపర్‌ అమోలెడ్‌ ఫుల్‌ స్క్రీన్ డిస్‌ప్లే
* 1080×2400 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
* క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720 జీ ప్రాసెసర్
* ఆండ్రాయిడ్‌ 11
* 16 ఎంపీ సెల్పీ కెమెరా
* 108+ 8 + 2+ 2 ఎంపీ క్వాడ్‌ రియల్‌ కెమెరా
* 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌
* 4500 ఎంఏహెచ్ బ్యాటరీ

ధరలు
* 6 జీబీ వేరియంట్‌ ధర రూ.17,999
* 8 జీబీ వేరియంట్‌ రూ.19,999