రియా చక్రవర్తికి నో బెయిల్

  • Published By: murthy ,Published On : September 11, 2020 / 12:48 PM IST
రియా చక్రవర్తికి నో బెయిల్

Updated On : October 31, 2020 / 4:07 PM IST

Rhea Chakraborty: సుశాంత్ సింగ్ గర్లఫ్రెండ్, మాదక ద్రవ్యాల కేసులో నిందుతురాలు రియా చక్రవర్తికి బెయిల్‌ను ముంబై కోర్టు నిరాకరించింది. రియా సోదరుడు Showik Chakraborty డ్రగ్ సిండికేట్‌లో కీలక సభ్యుడున్న వాదనతో ఏకీభవించిన కోర్టు అతనికీ నో చెప్పింది.

బెయిల్ ఇవ్వకూడనంత తప్పేమీ రియా చేయలేదని ఆమె లాయిర్ వాదనను కోర్టు పట్టించుకోలేదు. అంటే ఈనెల 22వరకు రియా జైల్‌లోనే ఉండాలి.



రియా రోజులో మాట మార్చుతోంది. ముందు ఇచ్చిన స్టేట్‌మేంట్‌ను కాదంది. అసలు జ్యుడిషియల్ కస్టడీలో ఉంటే తన ప్రాణాలకు రిస్క్ అని రియా ఆరోపించింది. తనను అత్యాచారం, హత్య చేస్తామని బెదిరింపులు వస్తున్నాయని, దానికితోడు మూడు విచారణలంటే తాను మానసికంగా తట్టుకోలేకపోతునన్ని, ఆరోగ్యం దెబ్బతింటోందని వాదించినా, కోర్టు ఒప్పుకోలేదు.



Narcotics Control Bureau మాత్రం రియాకుతన boyfriend Sushant Singh Rajput డ్రగ్స్ తీసుకొంటున్న విషయం తెలుసు, ఆమె డ్రగ్స్ ను చాలాసార్లు కొన్నది, కాబట్టి ఆమెకు డ్రగ్ నెట్ వర్క్ గురించిన సమాచారం ఉందని వాదించింది. అంతెందుకు Rhea Chakraborty తన క్రెడిట్ కార్డుతో డ్రగ్స్‌కు డబ్బులు చెల్లించింది. ఈ విషయాన్ని తానే ఒప్పుకుందనికూడా బ్యూరో కోర్టు దృష్టికి తీసుకొచ్చింది.