Yogi Adityanath : యూపీలో హింసకు తావు లేదు : యోగి ఆదిత్యనాథ్‌

Yogi Adityanath : దేశ‌వ్యాప్తంగా శ్రీరాముడి జన్మదిన వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. శ్రీరామ నవమిని పురస్కరించుకుని దేశ‌వ్యాప్తంగా శ్రీరాముని శోభ‌యాత్ర‌లు నిర్వ‌హించారు.

Yogi Adityanath : యూపీలో హింసకు తావు లేదు : యోగి ఆదిత్యనాథ్‌

Riots Not Even 'tu Tu Main Main Yogi Adityanath's Ram Navami Boast

Updated On : April 13, 2022 / 9:18 PM IST

Yogi Adityanath : దేశ‌వ్యాప్తంగా శ్రీరాముడి జన్మదిన వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. శ్రీరామ నవమిని పురస్కరించుకుని దేశ‌వ్యాప్తంగా శ్రీరాముని శోభ‌యాత్ర‌లు నిర్వ‌హించారు. పలు ప్రాంతాల్లో ఊరేగింపుల సమయంలో ప‌లు ప్రాంతాల్లో హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయి. గుజరాత్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో మత ఘర్షణలు చెలరేగాయి. దీనిపై స్పందించిన యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. బీజేపీ పాలిత యూపీలో ఎలాంటి హింసాత్మక ఘటనలకు తావు లేదన్నారు. లక్నోలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగీ పాల్గొన్నారు. యూపీలో రామనవమి సందర్భంగా హింసాత్మక సంఘటనలు రాష్ట్రంలో అల్లర్లకు చోటు లేదని అన్నారు. ఇప్పటికీ అదే విధానం కొనసాగుతోందని చెప్పారు.

యూపీకి చెందిన కొత్త అభివృద్ధి ఎజెండా చిహ్నమ‌ని పేర్కొన్నారు. దేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రంలో ప్రజలు శ్రీరామ న‌వ‌మి, పవిత్ర రంజాన్ మాసం రెండింటినీ శాంతి, గొప్ప ఉత్సాహంతో జరుపుకున్నారని యోగి పేర్కొన్నారు. 25 కోట్ల జనాభా ఉన్న యూపీలో 800 రామనవమి ర్యాలీలు జరిగాయన్నారు.

అదే సమయంలో రంజాన్ మాసం కావడంతో రోజా, ఇఫ్తార్‌లు కూడా జరుగుతున్నట్లు చెప్పారు. రెండు వర్గాల మధ్య వాగ్వాదం కూడా జరగలేదని, హింస, అల్లర్లనే ప్రశ్నే లేదన్నారు. ఉత్తరప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో నడిపించే వైఖరిని సూచిస్తుందని యోగి వివరించారు. పలు రాష్ట్రాల్లతో ఆదివారం రామనవమి వేడుకల సందర్భంగా హింసాకాండలో ఇద్దరు మృతిచెందారు. చాలా మంది గాయపడిన సంగతి తెలిసిందే.

Read Also : Yogi Adityanath: సీఎంపై కామెంట్లు చేసిన ఎమ్మెల్యే పెట్రోల్ బంక్ కూల్చివేత