సీబీఐ డైరక్టర్ గా బాధ్యతలు చేపట్టిన శుక్లా

  • Published By: venkaiahnaidu ,Published On : February 4, 2019 / 06:23 AM IST
సీబీఐ డైరక్టర్ గా బాధ్యతలు చేపట్టిన శుక్లా

Updated On : February 4, 2019 / 6:23 AM IST

సీబీఐ నూతన  డైరక్టర్ గా రిషి కుమార్ శుక్లా సోమవారం(ఫిబ్రవరి-4,2019) భాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో సీబీఐ డైరక్టర్ గా భాధ్యతలు చేపట్టిన ఆయనకి అధికారులు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. రెండేళ్లపాటు శుక్లా ఈ పదవిలో కొనసాగనున్నారు. మధ్యప్రదేశ్ ఐపీఎస్ కేడర్, 1983 బ్యాచ్ కు చెందిన శుక్లాను సీబీఐ డైరక్టర్ గా నియమిస్తూ ప్రధాని మోడీ నేతృత్వంలోని హై పవర్ కమిటీ నిర్ణయం తీసుకుంది. శనివారం(ఫిబ్రవరి-2,2019) ఈ మేరకు సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.