Ban On Construction : నిర్మాణ కార్మికుల ఒక్కొక్కరి అకౌంట్లలో రూ. 5 వేలు

నిర్మాణ కార్మికుల అకౌంట్లలో నగదు వేయాలని...కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నిర్మాణ రంగ కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Ban On Construction : నిర్మాణ కార్మికుల ఒక్కొక్కరి అకౌంట్లలో రూ. 5 వేలు

Delhi Ban

Updated On : November 25, 2021 / 5:29 PM IST

Ban On Construction : కరోనా కారణంగా..ఇప్పటికే నష్టపోయిన కార్మికులకు మరో కష్టం వచ్చి పడింది. నిర్మాణరంగానికి సంబంధించిన పనులు అన్నీ ఆగిపోయాయి. దీంతో పనులు జరుగకపోవడంతో ఈ రంగంపై ఆధారపడిన కుటుంబాలు కష్టాలను ఎదుర్కొంటున్నాయి. దీంతో వీరిని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిర్మాణ కార్మికుల అకౌంట్లలో నగదు వేయాలని…కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నిర్మాణ రంగ కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read More : Sweden PM Quits : బాధ్యతలు చేపట్టిన 7 గంటల్లోనే స్వీడన్ తొలి మహిళా ప్రధాని రాజీనామా

ఢిల్లీలో కాలుష్యం తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ప్రమాదకరస్థాయికి చేరుకోవడంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సీరియస్ అయిన సంగతి తెలిసిందే. దీంతో సీఎం కేజ్రీవాల్ సర్కార్ పలు చర్యలు తీసుకొంటోంది. కొద్ది రోజుల పాటు స్కూల్స్ మూసివేయాలని..ఉద్యోగుల విషయంలో పలు ఆదేశాలు జారీ చేసింది. నిర్మాణాల వల్ల కాలుష్యం అధికమౌతోందని గ్రహించిన ప్రభుత్వం..వెంటనే పనులు ఆపేయాలని సూచించింది. నిర్మాణ కార్యకలాపాలపై నిషేధం విధిస్తున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. కాలుష్యం వెదజల్లని పనులు కొనసాగించుకోవచ్చని సూచించింది.

Read More : Kim Jong Un : ‘స్క్విడ్ గేమ్’ వెబ్ సిరీస్ చూసినవారికి దారుణ శిక్ష విధించిన కిమ్ జోంగ్

పనులు ఆపివేయడం వల్ల ఉపాధి కోల్పోయిన కాలానికి లేబర్ సెస్ కింద వసూలు చేసిన నిధులను కార్మికులకు చెల్లింపులు చేయాలని సూచించింది. దీంతో కార్మికులకు చెల్లింపులు చేపట్టాలని తాజాగా నిర్ణయం తీసుకుంది. నిర్మాణ కార్మికుల ఒక్కొక్కరి ఖాతాల్లో రూ. 5 వేలు వేయాలని ఆదేశాలు ఇచ్చినట్లుగా సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. కార్మికులకు జరగిన నష్టాన్ని తీర్చేందుకు కనీస వేతనాల ప్రకారం నష్టపరిహారం కూడా అందిస్తామని వెల్లడించారు.