Russian Embassy : ఢిల్లీలో రష్యన్ ఎంబసీ వద్ద నిరసనలు.. హైఅలర్ట్..!
యుక్రెయిన్‌లో రష్యా సైనిక చర్యలు వెంటనే ఆపేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీ శాంతిపథ్‌లోని రష్యన్ ఎంబసీ ముందు ఓ గుర్తు తెలియని సంస్థ నిరసనలకు పిలుపునిచ్చింది.

Activists plan protest outside Russian Embassy in Delhi
Russian Embassy in Delhi : యుక్రెయిన్‌లో రష్యా సైన్యం మరింత రెచ్చిపోతోంది. యుక్రెయిన్ సైన్యంపై రష్యా వైమానిక దళాలు విరుచుకుపడుతున్నాయి. యుక్రెయిన్‌తో రష్యా యుద్ధం మొదలై 40 గంటలు దాటేసింది. యుక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. రష్యా సైనికులు యుక్రెయిన్ సైన్యం డ్రెస్సులు ధరించి లోపలికి చొచ్చుకుపోతున్నారు. ఈ పరిస్థితుల్లో యుక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యుక్రెయిన్‌లో రష్యా సైనిక చర్యలు వెంటనే ఆపేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీ శాంతిపథ్‌లోని రష్యన్ ఎంబసీ ముందు ఓ గుర్తు తెలియని సంస్థ నిరసనలకు పిలుపునిచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో రష్యన్ ఎంబసీ ముందు మూడంచెల భద్రత ప్రకటించడంతో పాటు 144 సెక్షన్ కూడా విధించారు.
ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో రష్యన్ ఎంబసీ వద్ద హైఅలర్ట్ ప్రకటించారు. ఢిల్లీలో రష్యా ఎంబసీ ముందు భారీగా భద్రతా బలగాలు మోహరించాయి. నిరసన తెలుపుతున్న వారిని రష్యన్ ఎంబసీ ముందు నుంచి పోలీసులు
పంపేస్తున్నారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న వేలాది భారతీయుల భద్రతకు సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్య విద్య అభ్యసించే విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయాందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం యుక్రెయిన్‌లో 16 వేల మంది భారతీయులు ఉన్నారు.
ఉక్రెయిన్‌లో వైద్య విద్య చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు 5:30కి రష్యన్ ఎంబసీ ముందు నిరసన తెలపాలని నిర్ణయించుకున్నారు. రష్యా యుక్రెయిన్‌పై చేస్తున్న యుద్దన్ని వెంటనే ఆపాలని సూచనలు చేస్తున్నారు. యుక్రెయిన్‌లో తమ పిల్లలు బలవుతున్నారని రష్యన్ ఎంబసీ వద్ద నిరసన తెలపాలని విద్యార్థుల తల్లిదండ్రులు నిర్ణయం తీసుకున్నారు. యుక్రెయిన్ మద్దతుదారులు నిరసన తెలుపుతున్న శాంతిపథ్ రష్యన్ ఎంబసీ మార్గాన్ని పోలీసులు మూసివేశారు.
రష్యన్ ఎంబసీ వద్ద భారీగా ఢిల్లీ పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించారు.
మరోవైపు.. తమ కూతురు బాంబుల నడుమ భయంభయంగా బతుకుతోందని విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రష్యా వెంటనే యుద్ధాన్ని ఆపేయాలని శాంతియుత మార్గాల్లో చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా.. యుక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులకు ఎంబసీ పలు సూచనలు చేస్తోంది. యుక్రెయిన్ నుంచి పోలాండ్ వైపు నడక దారిలో వచ్చే వారు శేహనీ – మేద్యక మధ్య సరిహద్దు దాటాలని సూచిస్తోంది. సొంత వాహనాల్లో వచ్చే వారు క్రాకో వీక్ ద్వారా సరిహద్దు దాటాలని సూచించింది. గూగుల్ మ్యాప్ ద్వారా తమ వివరాలు ఇండియన్ ఎంబసీకి అందించాలని దానికనుగుణంగా విమానాలను ఏర్పాటు చేస్తామని భారత ఎంబసీ కార్యాలయం వార్సా తెలిపింది.
Read Also : Russia-Ukraine War : యుక్రెయిన్‌కు రష్యా ఆఫర్.. పోరాటం ఆపి లొంగిపోతే చర్చలకు సిద్ధం!