మకర జ్యోతి : స్వాముల ఎదురు చూపులు

కేరళ : శబరిమలలో కీలక ఘట్టం మరికొద్ది గంటల్లో ఆవిష్కృతం కానుంది. ఈ ఘట్టాన్ని చూసేందుకు భారీగా అయ్యప్ప మాలలు ధరించిన స్వాములు శబరిమలకు చేరుకుంటున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. జనవరి 14వ తేదీ సొమవారం మకరజ్యోతి దర్శనం కానుంది. 6 గంటల 45 నిమిషాలకు జరిగే ఈ దర్శనం కోసం పంపానది, సన్నిధానం, హిల్ టాప్, టోల్ ప్లాజా వద్ద ఏర్పాట్లు చేశారు. పొన్నాంబలమేడు కొండపై జ్యోతి దర్శనమివ్వనుంది.
రెండు రోజుల క్రితమే పంధాలం నుండి అయ్యప్ప స్వామి తిరువాభరణాలను సాయంత్రం 6గంటలకు 18 మెట్ల మీదుగా సన్నిధానానికి చేరుస్తారు. అనంతరం తిరువాభరణం ఘట్టం జరుగుతుంది. సుమారు 18 మంది లక్షల మంది దర్శనానికి వస్తారని అంచనా.