Chinmoy Krishna Das: బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ చిన్మోయ్ కృష్ణదాస్ అరెస్ట్.. సద్గురు తీవ్ర ఆగ్రహం

చిన్మోయ్ అరెస్టుపై ఇస్కాన్ సంస్థ స్పందించింది. ప్రపంచంలో ఏ ఉగ్రవాదంతో ఇస్కాన్ కు సంబంధం లేదని, నిరాధారమైన ఆరోపణలు చేయడం దారుణమని ‘ఎక్స్’ ఖాతాలో ఇస్కాన్ సంస్థ పోస్టు చేసింది.

Chinmoy Krishna Das: బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ చిన్మోయ్ కృష్ణదాస్ అరెస్ట్.. సద్గురు తీవ్ర ఆగ్రహం

Sadhguru

Updated On : November 26, 2024 / 1:45 PM IST

Chinmoy Krishna Das: బంగ్లాదేశ్ కు చెందిన ప్రముఖ ఇస్కాన్ నాయకులలో ఒకరైన చిన్మోయ్ కృష్ణదాస్ ను ఢాకా పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ మీడియా కథనాల ప్రకారం.. ఇస్కాన్ కు చెందిన చిన్మోయ్ కృష్ణ దాస్ గత నెలలో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ జెండాను ఉద్దేశించి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో సోమవారం ఢాకా విమానాశ్రయంలో ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. కాగా.. చిన్మోయ్ కృష్ణ దాస్ కు న్యాయస్థానం మంగళవారం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.

Also Read: Maharashtra: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం.. సీఎం పదవికి ఏక్‌నాథ్‌ షిండే రాజీనామా

చిన్మోయ్ అరెస్టుపై ఇస్కాన్ సంస్థ స్పందించింది. ప్రపంచంలో ఏ ఉగ్రవాదంతో ఇస్కాన్ కు సంబంధం లేదని, నిరాధారమైన ఆరోపణలు చేయడం దారుణమని ‘ఎక్స్’ ఖాతాలో ఇస్కాన్ సంస్థ పోస్టు చేసింది. భారత కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, ఆయన్ను విడిపించాలని ఇస్కాన్ అధికారులు కోరారు. అక్కడి అధికారులు ఇస్కాన్ పై తప్పుడు ఆరోపణలు చేశారు. దీనిపై భారత ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. బంగ్లాదేశ్ ప్రభుత్వంతో మాట్లాడి మాది శాంతి, ప్రేమగ భక్తి ఉద్యమం అని తెలియజేయాలి. కృష్ణ దాస్ ను వెంటనే విడుదల చేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నామని ‘ఎక్స్’ లో ఇస్కాన్ సంస్థ పేర్కొంది.

Also Read: Donald Trump: అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆ మూడు దేశాలకు బిగ్ షాకివ్వనున్న డొనాల్డ్ ట్రంప్.. ఎందుకంటే?

చిన్మోయ్ కృష్ణదాస్ అరెస్టుపై ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు స్పందించారు. ఇది అవమానకరమైన చర్యగా అభివర్ణించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ ద్వారా పోస్టు చేశారు. ‘ప్రజాస్వామ్య దేశం మతతత్వ, నిరంకుశంగా మారడానికి ఎలా విచ్ఛిన్నమవుతుందో చూస్తున్నాం. బహిరంగ ప్రజాస్వామ్యం విలువలను అర్ధం చేసుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత. మతం, జనాభా బలహీనత ఆధారంగా హింసించడం ప్రజాస్వామ్య దేశాల మార్గం కాదు. దురదృష్టవశాత్తు, మన పక్క దేశం ప్రజాస్వామ్య సూత్రాలను వదిలేసింది. పౌరులందరికీ వారి అవసరాలు, నమ్మకాల ప్రకారం వారు జీవించే హక్కు ఉంది. అలాంటి ప్రజాస్వామ్య దేశాన్ని తిరిగి నిర్మించడం బంగ్లాదేశ్ లోని ప్రతి పౌరుడి బాధ్యత’ అని సుద్గురు అన్నారు.