BJPలో చేరిన వీరప్పన్ కూతురు

గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కూతురు విద్యారాణి ప్రజాసేవలోకి వచ్చారు. 2004 అక్టోబరు 18న వీరప్పన్ మరణం తర్వాత అతని గురించి ప్రస్తావన రావడం ఇదే తొలిసారి. శనివారం తమిళనాడులోని కృష్ణగిరి ప్రాంతంలో జరిగిన సదస్సులో ఆమె బీజేపీలోకి జాయిన్ అయ్యారు. పార్టీ జనరల్ సెక్రటరీ మురళీధర్ రావు, కేంద్ర మాజీ మంత్తి పొన్ రాధాకృష్ణన్ సమక్షంలో ఈ ఈవెంట్ జరిగింది.
‘నాన్న అనుసరించిన మార్గం తప్పు అయి ఉండొచ్చు. కానీ, ఆయనెప్పుడూ పేదల కోసమే పనిచేశారు. కులాలు.. మతాలకు అతీతంగా పేదల కోసం పని చేయాలనుకుంటున్నాను. ప్రధాని నరేంద్ర మోడీ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలనుకుంటున్నాను’ అని విద్యారాణి చెప్పుకొచ్చింది. విద్యారాణితో పాటు ఇతర పార్టీలకు చెందిన 1000మంది సభ్యులు బీజేపీలోకి జాయిన్ అయ్యారు.
వృత్తిరీత్యా లాయర్ అయిన విద్యారాణి సోషల్ వర్కర్‌గానూ పనిచేస్తున్నారు. వీరప్పన్‌కు పెద్ద కూతురైన విద్యా వార్తల్లోకి రావడం తొలిసారేం కాదు. బాయ్‌ఫ్రెండ్‌తో పెళ్లి విషయంలో తల్లి ముత్తులక్ష్మీ నిరాకరించడంతో తమిళనాడు హైకోర్టుకు వెళ్లి ప్రత్యేక అనుమతులు తెచ్చుకుంది.