SBI clerk exam 2021: కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా క్లర్క్‌ ప్రిలిమ్స్‌ 2021 పరీక్ష శనివారం నుంచి జరగనుంది. కరోనా కారణంగా షిల్లాంగ్‌, అగర్తలా, ఔరంగాబాద్‌, నాసిక్‌లలో జరగాల్సిన ఈ పరీక్ష వాయిదాపడగా మిగతా కేంద్రాలలో కొనసాగనుంది.

SBI clerk exam 2021: కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్

Sbi

Updated On : July 10, 2021 / 12:52 PM IST

SBI clerk exam 2021: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా క్లర్క్‌ ప్రిలిమ్స్‌ 2021 పరీక్ష శనివారం నుంచి జరగనుంది. కరోనా కారణంగా షిల్లాంగ్‌, అగర్తలా, ఔరంగాబాద్‌, నాసిక్‌లలో జరగాల్సిన ఈ పరీక్ష వాయిదాపడగా మిగతా కేంద్రాలలో కొనసాగనుంది. ఇతర కేంద్రాల నుంచి ఎస్‌బీఐ క్లర్క్‌ ప్రిలిమ్స్‌ పరీక్షకు హాజరయ్యే క్యాండిడేట్లు ఎస్‌బీఐ అఫీషియల్ వెబ్‌సైట్‌లో డిటైల్స్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఎస్‌బీఐ క్లర్క్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష జులై 10,11,12వ తేదీల్లో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పరీక్ష కేంద్రాల్లో కంటిన్యూ అవుతుంది. అఫీషియల్ వెబ్‌సైట్‌ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

అభ్యర్థులు అడ్మిట్‌ కార్డును ముందుగానే డౌన్‌లోడ్‌ చేసుకుని పరీక్ష కేంద్రానికి వెళ్లాలి. పరీక్ష సమయానికి కనీసం 90 నిమిషాల ముందు ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవాలి. కోవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ.. ఎటువంటి గాడ్జెట్‌ లేదా ఎలక్ట్రానిక్‌ పరికరాలను సెంటర్లలోనికి తీసుకెళ్లకూడదు.

కొవిడ్ రూల్స్:
* మాస్క్‌, హ్యాండ్‌ శానిటైజర్స్‌, వాటర్‌ బాటిల్స్‌ ఎవరికి వారు తీసుకెళ్లాల్సి ఉంటుంది. పరీక్ష కేంద్రాలలో సామాజిక దూరం తప్పనిసరి.
* మాస్క్‌ లేకుండా పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు అనుమతి ఉండదు.
* అలాగే పరీక్ష కేంద్రం వద్ద ప్రతి అభ్యర్థికి థర్మల్‌ స్క్రీనింగ్‌ ఉంటుంది.