Supreme Court: 11 మంది అత్యాచార నిందితుల విడుదలను ఛాలెంజ్ చేస్తూ బిల్కిస్ బానో వేసిన రివ్యూ పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టు

ఖైదీలందరినీ ముందస్తుగా విడుదల చేయడానికి సంబంధించిన పత్రాలు లేదా మొత్తం ఫైల్‌ను అభ్యర్థిస్తూ తాను రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించానని, అయితే రిమైండర్‌లు ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం రాలేదని బిల్కిస్ పేర్కొన్నారు. నేరానికి గురైనప్పటికీ, అటువంటి ఉపశమన ప్రక్రియ లేదా అకాల విడుదల గురించి తనకు ఎలాంటి క్లూ లేదని ఆమె తన పిటిషన్‭లో పేర్కొన్నారు.

Supreme Court: 11 మంది అత్యాచార నిందితుల విడుదలను ఛాలెంజ్ చేస్తూ బిల్కిస్ బానో వేసిన రివ్యూ పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టు

SC dismisses Bilkis Bano's review petition challenging release of 11 rape convicts

Updated On : December 17, 2022 / 12:03 PM IST

Supreme Court: తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దోషుల విడుదలను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు తలుపు తట్టిన బాధితురాలు బిల్కిస్ బానోకు చుక్కెదురైంది. ఆమె వేసిన రివ్యూ పిటిషన్‭ను సుప్రీం ధర్మాసనం విచారణకు తీసుకోకుండా తిరస్కరించింది. 2002 నాటి ఘటనలో నిందితులైన ఈ 11 మందిని 2008లో దోషులుగా గుర్తిస్తూ కోర్టు వీరికి శిక్ష విధించింది. అనంతరం గుజరాత్ రిమిషన్ పాలసీ కింద ఆగస్టు 15న వీరిని విడుదల చేశారు. గోద్రా అల్లర్లు జరిగిన సమయంలో బిల్కిస్‭కు 21 ఏళ్లు. పైగా ఐదు నెలల గర్భవతి. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగింది. అంతే కాకుండా ఆమె మూడేళ్ల కూతురితో పాటు ఏడుగురు కుటుంబ సభ్యుల్ని అతి కిరాతకంగా హతమార్చారు.

Supreme Court: అందుకేగా మేమున్నది.. వ్యక్తిగత స్వేచ్ఛపై కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు

బిల్కిస్ వేసిన పిటిషన్‭లో ఏముందంటే?
ఈ కేసులో 1992 నాటి ఉపశమన నిబంధనలను వర్తింపజేయడానికి గుజరాత్ ప్రభుత్వానికి అనుమతినిస్తూ మేలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను బిల్కిస్ బానో సవాలు చేశారు. 11 మంది అత్యాచార దోషులను ముందస్తుగా విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ ఆమె రిట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. 2004లో అహ్మదాబాద్‌ నుంచి ముంబైలోని సమర్థ న్యాయస్థానానికి విచారణను బదిలీ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించినందున, 11 మంది దోషులు జైలు నుంచి విడుదల కాలేదని, మహారాష్ట్ర రిమిషన్ పాలసీ కేసును నియంత్రించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఖైదీలందరినీ ముందస్తుగా విడుదల చేయడానికి సంబంధించిన పత్రాలు లేదా మొత్తం ఫైల్‌ను అభ్యర్థిస్తూ తాను రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించానని, అయితే రిమైండర్‌లు ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం రాలేదని బిల్కిస్ పేర్కొన్నారు. నేరానికి గురైనప్పటికీ, అటువంటి ఉపశమన ప్రక్రియ లేదా అకాల విడుదల గురించి తనకు ఎలాంటి క్లూ లేదని ఆమె తన పిటిషన్‭లో పేర్కొన్నారు.

Mumbai: శివాజీ, అంబేద్కర్‭లను అవమానించారంటూ మహా వికాస్ అగాడీ ‘హల్లా బోల్’ ర్యాలీ