Muslim quota: ముస్లిం కోటాపై రాజకీయ వ్యాఖ్యలు చేస్తే అంతేనట.. వార్నింగ్ ఇచ్చిన సుప్రీంకోర్టు
ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన సందర్భం లేదా కంటెంట్ గురించి కోర్టుకు చెప్పలేదని పేర్కొన్నారు. "ఎవరైనా తాము ప్రధానంగా మతం ఆధారిత రిజర్వేషన్‌కు వ్యతిరేకమని చెబితే, అది పూర్తిగా ఆమోదయోగ్యమే" అని మెహతా వాదించారు.

supreme court
Muslim quota: కర్ణాటక అసెంబ్లీ ఎన్నిక నోటిఫికేషన్ విడుదలకు ముందు ముస్లిం కోటాను రద్దు చేసి, సరికొత్త వివాదానికి తెరలేపింది అక్కడి బొమ్మై ప్రభుత్వం. ఇక ఆరోజు నుంచి కన్నడ ఎన్నికల రాజకీయం దీని చుట్టూనే తిరుగుతోంది. ముస్లింల రిజర్వేషన్లు పునరిద్దరిస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తుండగా.. మతం ఆధారంగా రిజర్వేషన్లు రాజ్యాంగంలో లేవంటూ బీజేపీ సమర్ధించుకుంటోంది. అయితే తాజాగా ఇద్దరి వాదనలకు సుప్రీంకోర్టు బ్రేక్ వేసింది. ముస్లిం కోటాపై రాజకీయ ప్రకటనలు ఇవ్వరాదంటూ రాజకీయ పార్టీలకు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.
Warangal West Constituency: కారు స్పీడ్‌కి బ్రేకులు పడతాయా.. దాస్యం వినయ్ భాస్కర్ గ్రాఫ్ ఎలా ఉంది?
రాష్ట్రంలోని ముస్లింలకు ఓబీసీ కేటగిరీలో దశాబ్దాలుగా ముస్లింలకు ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్‌లను రద్దు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌లపై విచారణను జూలైకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. అనంతరం ఈ విషయమై ఏ రాజకీయ పార్టీ ప్రకటనలు చేయరాదని, కోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నప్పుడు రాజకీయ పార్టీలు మరింత జాగ్రత్తగా మసులుకోవాలంటూ హెచ్చరికలు జారీ చేసింది.
Pawan Kalyan : రేపు రాజమండ్రికి పవన్ కల్యాణ్ .. రైతన్నలకు పరామర్శ, పోలవరం ప్రాజెక్టు సందర్శన
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముస్లింల రిజర్వేషన్లు తమ పార్టీ రద్దు చేసిందంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చాలా గొప్పగా ప్రసంగాలు చేశారు. దీనిపై అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషనర్ల తరపున దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. కాగా ‘‘విషయం కోర్టు పరిధిలో ఉన్నప్పుడు అలాంటి ప్రకటనలు ఎందుకు చేయాలి?’’ అని జస్టిస్ బీవీ నాగరత్న ప్రశ్నించారు.
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్!
ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన సందర్భం లేదా కంటెంట్ గురించి కోర్టుకు చెప్పలేదని పేర్కొన్నారు. “ఎవరైనా తాము ప్రధానంగా మతం ఆధారిత రిజర్వేషన్‌కు వ్యతిరేకమని చెబితే, అది పూర్తిగా ఆమోదయోగ్యమే” అని మెహతా వాదించారు. ఆ వెంటనే క్రమశిక్షణను కొనసాగించాలని కోర్టు కోరింది. “మతం ఆధారంగా రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని ఈ పోడియం నుంచి ఎస్‌జీగా, ఈ కేసులో హాజరవుతున్న న్యాయవాదిగా మీరు ప్రకటన చేయవచ్చు. కానీ బహిరంగ ప్రదేశం నుంచి వేరొకరు ప్రకటనలు చేయడం ఏంటి?” అని తుషార్ మెహతాతో జస్టిస్ బీవీ నాగరత్న అన్నారు.
Karnataka Polls: కర్ణాటక ఎన్నికల్లో డబ్బే డబ్బు.. జస్ట్ అధికారులు పట్టుకున్నదే రూ.378 కోట్లు
అయితే స్వలింగ వివాహం కేసులో విచారణ కొనసాగుతున్నందున ఈ కేసు విచారణను వాయిదా వేయాలని తుషార్ మెహతా కోరారు. గత విచారణలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కొనసాగుతాయని ధర్మాసనం ఆదేశించి, జూలైలో ఈ అంశాన్ని విచారిస్తామని పేర్కొంది.