నిర్భయ నిందితులకు డిసెంబర్ 16న ఉరిలేనట్లే

నిర్భయ నిందితులకు డిసెంబర్ 16న ఉరిలేనట్లే

Updated On : December 12, 2019 / 12:34 PM IST

అపెక్స్ కోర్టు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ గురువారం నిర్భయ నిందితులపై మంగళవారం డిసెంబరు 17 మధ్యాహ్నం 2గంటలకు విచారించనున్నట్లు తెలిపింది. 2012 డిసెంబరులో.. దేశ రాజధాని ఢిల్లీలో కదిలే బస్సులో నిర్భయపై అత్యాచారానికి పాల్పడిన దోషుల్లో ఒకడైన అక్షయ్‌ కుమార్‌ సింగ్‌.. తనకు క్షమాభిక్ష పెట్టాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. 

ఆ పిటీషన్ లో వేదాలు, పురాణాలను గురించి ప్రస్తావించిన విషయం.. ఢిల్లీలో వాయు, నీటి కాలుష్యం వల్ల ఎలాగూ జీవితం హరించుకుపోతున్నది. ఇక ఉరిశిక్షలు ఎందుకు? అని చెప్పుకొచ్చాడు. ఈ నిందితులను డిసెంబరు 13న పాటియాలా కోర్టు విచారించనుంది. 

తీహార్ జైలు నుంచి తరలించే సమయంలో భద్రతాపరమైన పొరబాట్లు జరగొచ్చని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరపనున్నారు. వినయ్ క్షమాభిక్ష కావాలని కోరిన పిటిషన్ రాష్ట్రపతి దగ్గరే ఉంది. 

రామ్ సింగ్ అనే ఒకరు తీహార్ జైల్లో 2013 మార్చిలో ఆత్మహత్య చేసుకోగా, మరో నిందితుడు మైనర్ కావడంతో మూడేళ్ల శిక్ష తర్వాత విడుదలయ్యాడు. మిగిలిన నలుగురు నిందితులు అక్షయ్‌, వినయ్‌ శర్మ, పవన్‌, ముఖేశ్‌లకు ఉరిశిక్షను ఖరారు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది.