Shah Rukh Khan : బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్‌కు బెదిరింపులు… వై ప్లస్ సెక్యూరిటీ
జవాన్ సినిమా విజయవంతం తర్వాత బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్‌కు బెదిరింపులు వచ్చాయి. దీంతో మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం షారూఖ్ భద్రతా స్థాయిని వై ప్లస్ కేటగిరీకి అప్‌గ్రేడ్ చేసింది....

Shah Rukh Khan
Shah Rukh Khan : జవాన్ సినిమా విజయవంతం తర్వాత బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్‌కు బెదిరింపులు వచ్చాయి. షారుఖ్ ఖాన్ ఇటీవలి సినిమాలు పఠాన్, జవాన్ చిత్రాలు విజయవంతమైన తర్వాత అతన్ని హతమారుస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు వచ్చాయి. దీంతో మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం షారూఖ్ భద్రతా స్థాయిని వై ప్లస్ కేటగిరీకి అప్‌గ్రేడ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వీఐపీ సెక్యూరిటీ ఐజీ షారుక్ ఖాన్ భద్రతను పెంచారు.
Also Read :Hamas Attack On Israel : ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి ఎఫెక్ట్…పెరిగిన ముడి చమురు ధరలు
భద్రతా సేవల కింద సర్కారు చార్జీ చేయనుంది. సంబంధిత సెక్యూరిటీ ఖర్చులను షారూఖ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించనున్నారు. అధిక ముప్పును ఎదుర్కొంటున్న వ్యక్తులకు వై ప్లస్ భద్రత కల్పిస్తారు. షారూఖ్ నివాసం వద్ద ఉన్న ఐదుగురు సాయుధ గార్డులతో పాటు, 24 గంటల పాటు మూడు షిఫ్టులలో పని చేసే ఆరుగురు వ్యక్తిగత భద్రతా అధికారులను నియమించారు.
Also Read :Afghanistan earthquakes : అఫ్ఘానిస్థాన్‌లో ఎటు చూసినా శవాల గుట్టలే…2,445కు చేరిన మృతుల సంఖ్య
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపుల కారణంగా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు కూడా వై ప్లస్ భద్రత కల్పించారు. సెప్టెంబర్ 7వతేదీన హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన అట్లీ దర్శకత్వం వహించిన జవాన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్ల రూపాయలను వసూలు చేసిన తొలి హిందీ చిత్రంగా చరిత్ర సృష్టించింది.
Also Read :Goa beach : గోవా బీచ్‌లో ఫిష్ కర్రీ, రైస్ విక్రయాలు తప్పనిసరి…ప్రభుత్వ ఉత్తర్వులు