Aryan Khan: తనయుడి కోసం కొత్త లాయర్ అపాయింట్ చేసిన షారుఖ్ ఖాన్
ముంబై డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ కోసం కొత్త అడ్వకేట్ ను నియమించుకున్నాడు షారుఖ్.

Mumbai Drugs Case Court Rejects Bail Plea Of Aryan Khan
Aryan Khan: ముంబై డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ కోసం కొత్త అడ్వకేట్ ను నియమించుకున్నాడు షారుఖ్. 2002లో ఓ కేసు నిమిత్తం సల్మాన్ ఖాన్ తరపు వాదించిన న్యాయవాది అమిత్ దేశాయ్ ను ఆశ్రయించాడు షారుఖ్.
అక్టోబర్ 11 సోమవారం ఆర్యన్ ఖాన్ తరపున వాదన వినిపించారు అమిత్. బెయిల్ కోసం అప్లై చేయగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణ కోసం ఒక వారం రోజుల పాటు కస్టడీలో ఉండాలని తెలిపింది. దీనిపై అమిత్ దేశాయ్ మాట్లాడుతూ.. ఆ వ్యక్తి ఇప్పటికే వారం రోజులుగా జైలులో ఉంటున్నారు. బెయిల్ గురించి వాదించడం లేదు. బెయిల్ ఇచ్చే తేదీ అనే అడుగుతున్నాని అన్నారు.
అడ్మినిస్ట్రేటివ్ కారణంతో ఒకరి స్వేచ్ఛను అడ్డుకోలేం. వారి విచారణ కొనసాగించుకోవచ్చు. దీని గురించి శిక్ష విధించినా సంవత్సరం పాటు మాత్రమే విధించాలి. కానీ, అతనికి వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యం లేదు’ అని చెప్పారు. ఆర్యన్ ఖాన్ కోర్టులో చివరిసారి అక్టోబర్ 11న హాజరుకాగా తర్వాతి విచారణ అక్టోబర్ 13న ఉండనుంది.
…………………………………………. : థైరాయిడ్ సమస్య ప్రమాదకరమేనా?…
సల్మాన్ ఖాన్ బెయిల్ కోసం 2015లో అమిత్ దేశాయ్ వాదన వినిపించారు. సల్మాన్ ఖాన్ కు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన లోయర్ కోర్ట్ ఆర్డర్ ఛాలెంజ్ చేస్తూ బెయిల్ పిటిషన్ వేశారు. అనుకున్నట్లుగానే అమిత్.. మే 2015లో సల్మాన్ ఖాన్ కు బెయిల్ తెచ్చిపెట్టారు. రూ.30వేల పూచీకత్తుతో బెయిల్ ఇచ్చారు.