Ganesha Puja : సీఎం ఇంట్లో వినాయకుడికి పూజలు చేసిన సల్మాన్, షారుఖ్ ఖాన్

బాలీవుడ్ సూపర్ స్టార్లు షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఆదివారం రాత్రి గణపతి పూజలో పాల్గొనేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఇంటికి వచ్చారు. బాలీవుడ్ హీరోల వినాయకుడి పూజకు సంబంధించిన పలు చిత్రాలు, వీడియోలు ఆన్‌లైన్‌లో ప్రసారమయ్యాయి....

Ganesha Puja : సీఎం ఇంట్లో వినాయకుడికి పూజలు చేసిన సల్మాన్, షారుఖ్ ఖాన్

Shah Rukh,Salman Ganesha Puja

Updated On : September 25, 2023 / 8:09 AM IST

Ganesha Puja : బాలీవుడ్ సూపర్ స్టార్లు షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఆదివారం రాత్రి గణపతి పూజలో పాల్గొనేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఇంటికి వచ్చారు. బాలీవుడ్ హీరోల వినాయకుడి పూజకు సంబంధించిన పలు చిత్రాలు, వీడియోలు ఆన్‌లైన్‌లో ప్రసారమయ్యాయి. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Asaduddin Owaisi challenge : రాహుల్ గాంధీకి ఎంపీ అసదుద్దీన్ బిగ్ ఛాలెంజ్

షారుఖ్ ఖాన్ తో పాటు అతని మేనేజర్ పూజా దద్లానీ కూడా సీఎం ఇంట్లో పూజలో పాల్గొన్నారు. (Shah Rukh Khan, Salman Khan Attend Ganesha Puja) మరోవైపు సల్మాన్ ఖాన్ తన సోదరి అర్పిత, బావ ఆయుష్ శర్మతో కలిసి గణేశ్ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. పూజా కార్యక్రమం అనంతరం షారూఖ్, సల్మాన్ ఇద్దరూ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేతో కలిసి ఫొటోలకు పోజులిచ్చి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. (Maharashtra CM Eknath Shinde’s Residence) రూక్ బ్లూ కలర్ పఠానీ సూట్ ధరించి పూజ కోసం వచ్చారు.

Gujarat : గుజరాత్‌లో కూలిన వంతెన…నదిలో పడిన 10 మందిని రక్షించారు

సల్మాన్ ఖాన్ ఎరుపు రంగు కుర్తా ధరించారు. ఖాన్ లతో పాటు బాలీవుడ్ కు చెందిన జాకీ ష్రాఫ్, అర్జున్ రాంపాల్, ఆశా భోంస్లే, బోనీ కపూర్, రష్మీ దేశాయ్ తదితరులు ఏక్ నాథ్ షిండే ఇంట్లో గణేష్ చతుర్థి వేడుకలకు హాజరయ్యారు. షారుఖ్ ఖాన్ తన చిన్న కుమారుడు అబ్రామ్‌తో కలిసి ముంబయిలోని ప్రసిద్ధ లాల్‌బాగ్చా రాజా వద్ద గణేశుని ఆశీర్వాదం కూడా తీసుకున్నారు.

Nigeria : నైజీరియాలో గన్‌మెన్ కాల్పుల్లో 14 మంది మృతి

జవాన్ చిత్రం ఘన విజయం అనంతరం షారూఖ్ ఇటీవల ముంబయిలో విలేఖరుల సమావేశాన్ని నిర్వహించారు. సల్మాన్ టైగర్ 3 చిత్రాన్ని ఈ దీపావళికి థియేటర్లలోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో కత్రినా కైఫ్ కూడా నటిస్తోంది. అక్టోబర్‌లో సల్మాన్ బిగ్ బాస్ 17వ సీజన్‌కు హోస్ట్‌గా కనిపించనున్నారు.