రామ మందిర నిర్మాణానికి షియా వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ రిజ్మి విరాళం 

  • Published By: veegamteam ,Published On : November 15, 2019 / 05:48 AM IST
రామ మందిర నిర్మాణానికి షియా వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ రిజ్మి విరాళం 

Updated On : November 15, 2019 / 5:48 AM IST

అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి అన్ని వర్గాల నుంచి చక్కటి మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలో  రామ మందిరం నిర్మించటానికి ఉత్తరప్రదేశ్‌ షియా సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ వసీం రిజ్మి రూ. 51 వేలు విరాళం ప్రకటించారు. 

ఈ సందర్భంగా గురువారం (నవంబర్ 14)న  రజ్మి మాట్లాడుతూ..దశాబ్దలుగా పెండింగ్‌లో ఉన్న ఈ కేసుపై సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన ఉత్తమమైన తీర్పును ఇచ్చిందని వసీం రిజ్మి ఈ సందర్భంగా అన్నారు. అయోధ్యలో రామాలయాన్ని నిర్మించేందుకు షియా వక్ఫ్ బోర్డు అనుకూలంగా ఉందని తెలిపారు. అంతేకాదు లార్డ్ రామ మనందరికీ పూర్వీకుడు కాబట్టి ఆయన ఆలయ నిర్మాణానికి రామ్ జన్మభూమి న్యాస్ కు ‘Wasim Rizvi Films’ తరపున రూ.51 వేలు విరాళంగా ఇస్తున్నామని రిజ్వీ తెలిపారు. రామమందిరం నిర్మాణానికి షియా వక్ఫ్‌ బోర్డు సహాయం చేస్తుందన్నారు వసీం రిజ్మి. 

అయోధ్యలోనే రామమందిరం నిర్మించాలని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. మసీదుకు ఐదెకరాల స్థలాన్ని కేటాయించిన విషయం తెలిసిందే.