Pakistan Ship in Mumbai : చైనా టు పాకిస్తాన్ వయా ముంబై.. నౌకను నిలిపివేసిన కస్టమ్స్ అధికారులు!

Pakistan Ship in Mumbai : చైనా నుంచి పాకిస్తాన్ లోని కరాచీకి వెళ్తున్న ఓడను ముంబైలోని నవా షేవా పోర్టులో నౌకను అధికారులు నిలిపివేశారు. ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన సమాచారంతో కస్టమ్ అధికారులు రంగంలోకి దిగారు.

Pakistan Ship in Mumbai : చైనా టు పాకిస్తాన్ వయా ముంబై.. నౌకను నిలిపివేసిన కస్టమ్స్ అధికారులు!

Ship from China to Pak stopped in Mumbai

Pakistan Ship in Mumbai : దయాది దేశం పాకిస్తాన్ కుట్రలు ఆపడం లేదా? బోర్డర్‌లోనే కాదు.. భవిష్యత్తులో భారత్ పైకి ఉపయోగించేందుకు అణ్వస్త్రాలను రెడీ చేసుకుంటుందా? అందుకు చైనా సహకరిస్తుందా? అంటే అవుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చైనా టు పాకిస్తాన్ వయా ముంబై నుంచి వెళ్తున్న నౌకలో దొరికిన పరికరాలు కస్టమ్ అధికారులను షాకింగ్ గురిచేస్తున్నాయి.

Read Also : BJP First List : బీజేపీ ఫస్ట్ లిస్ట్ విడుదల.. ఆ 8 సీట్లు పెండింగ్‌లో పెట్టడానికి కారణం ఏంటి?

చైనా నుంచి పాకిస్తాన్ లోని కరాచీకి వెళ్తున్న ఓడను ముంబైలోని నవా షేవా పోర్టులో నౌకను అధికారులు నిలిపివేశారు. ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన సమాచారంతో కస్టమ్ అధికారులు రంగంలోకి దిగారు. పోర్టులోనే నౌకను ఆపేశారు. గత నెల 23నే ఈ నౌకను ముంబై పోర్టులో అధికారులు అడ్డుకున్నారు. ఆలస్యంగా ఈ విషయంలో వెలుగులోకి రావడంతో డీఆర్డీఓ, కస్టమ్స్ అధికారులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు.

దాయాది దేశం అణు కార్యక్రమాల కోసమేని అనుమానాలు? : 
ముంబైలో నిలిపివేసిన నౌకలో కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ మిషన్‌కు సంబంధించిన సరుకును గుర్తించారు అధికారులు. సీఎన్‌సీ మిషన్ ఇటాలీయన్ కంపెనీలో తయారుచేసినట్టు తెలుస్తోంది. సీఎన్‌సీ మిషన్‌ను కంప్యూటర్ ద్వారా నియంత్రిస్తారని డీఆర్డీఓ తెలిపింది. ఈ నౌకలో దాయాది దేశం అణు కార్యక్రమాల కోసం ఉపయోగపడుతుందని అనుమానిస్తున్నారు.

నౌకలో క్షిపణి అభివృద్ధికి కావాల్సిన కీలకమైన భాగాలను తయారుచేయడానికి నౌకలోని పరికరాలు ఉపయోగపడతాయని అంటున్నారు. సీఎన్ సీ మిషన్ ఉత్తర కొరియా అణు కార్యక్రమాల్లో ఉపయోగిస్తోంది. అధికారులు పకడ్బందీ నిఘాతో భారీ కార్గోను తనిఖీ చేసి దాయాది కుట్రలపై భారత రక్షణ అధికారులను అప్రమత్తం చేశారు.

దాయాది కుట్రలపై భారత రక్షణ అధికారులను అప్రమత్తం చేశారు. కార్గోను తనిఖీ చేసిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ టీం ఓ నిర్ధారణకు వచ్చింది. ఆ తర్వాత సరుకు స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. లోడింగ్, ఇతర డాక్యుమెంట్స్ పరిశీలించిన అధికారులకు ప్రాథమిక విచారణలో కీలక విషయాలు తెలిశాయి. 22 వేల 180 కిలోల సరుకు తైవాన్ మైనింగ్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్టు కో లిమిటెడ్ నుంచి పాకిస్తాన్లోని కాస్మోస్ ఇంజనీరింగ్ కోసం పంపుతున్నట్టు గుర్తించారు. కాస్మోస్ ఇంజినీరింగ్ సంస్థ పాకిస్తాన్ కోసం రక్షణ పరికరాలను సరఫరా చేస్తోంది.

కాస్మోస్ ఇంజినీరింగ్ సంస్థకు ఈ పరికరాలు సప్లయ్ అవుతున్నాయంటే ఇది పక్కాగా అణు క్షిపణి ఈక్వెప్‌మెంటేనని డీఆర్డీఓ అధికారులు భావిస్తున్నారు. చైనా నుంచి పాకిస్తాన్‌కు ఎగుమతి అవుతున్న డ్యూయల్ యూజ్ మిలిటరీ గ్రేడ్ వస్తువులను భారత అధికారులు స్వాధీనం చేసుకోవటం ఇదే మొదటిసారి కాదు. మార్చి 12 2022లో నవసేవ పోర్ట్‌లోని ఇటాలియన్ కంపెనీకి చెందిన ధర్మో ఎలక్ట్రికల్ పరికరాల్ని సీఎస్ చేశారు అధికారులు. యూరప్, యూఎస్ నుంచి నిషేధిత వస్తువుని కొనటానికి చైనాని ఒక మార్గంగా వినియోగించుకుంటుంది పాకిస్తాన్.

Read Also : Elon Musk : ఓపెన్ ఏఐని టార్గెట్ చేసిన మస్క్.. సామ్ ఆల్ట్‌మన్‌పై దావా!